TTD Job Notification 2024
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుండి పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీటిస్ట్ Paediatric Cardiac Anaesthetist-1 post , పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ Paediatric Cardiologist -1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి సంబంధిత మెడికల్ విభాగాల్లో MD చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.అర్హులైన హిందూ అభ్యర్థులు ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చదివి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ చేసే ముఖ్యమైన తేదీలు:
అర్హతలు కలిగిన అభ్యర్థులు 2024 నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. మీరు అప్లికేషన్స్ పంపించవలసిన అడ్రస్ ఈ క్రింది విధంగా ఉన్నది.
ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, నియర్ బర్డ్ ప్రేమిసెస్, తిరుపతి – 517507.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుండి 02 పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థీటిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సంబంధిత మెడికల్ విభాగాల్లో MD చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
అర్హతలు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ ఆఫ్ లైన్ విధానంలో సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
టీటీడీ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులలో ఏ కేటగిరీకి సంబందించిన అభ్యర్థులు అయిన ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,01,500/- జీతాలతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ తో పాటు కావాల్సిన సర్టిఫికెట్స్:
10th, ఇంటర్, డిగ్రీ, PG అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు,4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్,అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి,పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి .
- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా అభ్యర్థి అర్హతను గుర్తించాలి. అప్లికేషన్ తో పాటు సంబంధించిన ధృవపత్రాలను జతపరచవచ్చు.
- గరిష్ట వయో పరిమితి 01.11.2024 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు,SC, ST మరియు BCలకు సడలింపు- 5 సంవత్సరాలు మరియు ఎక్స్-సర్వీస్ మ్యాన్ 3 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
- డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన తేదీ, నెల మరియు సంవత్సరం తరువాత Experiance ఎన్ని సంత్సరాలూ అని స్పష్టంగా తెలియజేయాలి.
- అవసరం మేరకు పూర్తి చేయని అభ్యర్థుల అప్లికేషన్స్ / వారి దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
- ట్రస్ట్‌కి రిక్రూట్‌మెంట్ విధానాన్ని మార్చే పూర్తి హక్కు ఉంది
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేయనుకోగలరు.
టీటీడీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోవాలి.