తెలంగాణా రాష్ట్రం మంచిరియాల్ జిల్లాలో డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Telangana District Court Jobs Notification 2025 తెలంగాణాలోని మంచిరియాల్ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష లేకుండా పూర్తి చేయబడుతుంది. అభ్యర్థులు అనుభవం, అర్హతలు, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక అవుతారు.
ముఖ్యమైన వివరాలు
1. దరఖాస్తు చివరి తేదీ:
- 22 జనవరి 2025 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
- అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాన్ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి, మంచిరియల్ జిల్లాకి సీల్డ్ కవర్లో స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపాలి.
అర్హతలు & వయోపరిమితి
విద్యా అర్హత:
- కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- SC/ST/OBC/EWS అభ్యర్థులకు వయస్సులో 05 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ప్రత్యేక అర్హతలు:
- డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
- కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
- ట్రాఫిక్ రూల్స్ & వాహన నిర్వహణపై అవగాహన ఉండాలి.
పని ప్రదేశం:
- ఎంపికైన అభ్యర్థులు 2 సంవత్సరాల పాటు టెంపరరీ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
- ఎటువంటి రాత పరీక్ష లేదా ఫీజు లేదు.
- అభ్యర్థులను 10వ తరగతి మార్కులు, అనుభవం, మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం మంచిరియల్ జిల్లా కోర్టులో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
శాలరీ వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు ₹19,500/- శాలరీ నెలకు చెల్లించబడుతుంది.
- ఇతర అలవెన్సులు ఉండవు.
అప్లికేషన్ ఫీజు
- ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
- అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్లు
- 10వ తరగతి సర్టిఫికెట్
- డ్రైవింగ్ లైసెన్స్
- కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/OBC/EWS అభ్యర్థులకు)
- స్టడీ సర్టిఫికెట్
- అనుభవ పత్రాలు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (2)
- పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం
ఎలా దరఖాస్తు చేయాలి
- నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారాన్ని అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలరు.
- దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి, పై పేర్కొన్న సర్టిఫికెట్లు జతచేసి ప్యాక్ చేయాలి.
- దానిని స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపాలి:
Principal District & Sessions Judge, Mancherial District, Telangana.
మరిన్ని ముఖ్యమైన సూచనలు
- దరఖాస్తు ఫారంలో తప్పులేవీ లేకుండా సరిగ్గా నింపండి.
- అందజేసే సర్టిఫికెట్లు స్వయంసాక్షరంగా (Self-attested) ఉండాలి.
- మంచిరియల్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది, కానీ నాన్-లోకల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- సమయానికి ముందే దరఖాస్తు పంపించండి.