SCR Railway Group C Notification 2025 – దక్షిణ మధ్య రైల్వే క్రీడా కోటా రిక్రూట్‌మెంట్ 2025
RAILWAY RECRUITMENT CELL-SOUTH CENTRAL RAILWAY : ఆఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు
సౌత్ సెంట్రల్ రైల్వే (SCR Railway Group C Notification 2025), సికింద్రాబాద్ 61 గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్టుల కోసం స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు నాందేడ్, గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లు మరియు SCR హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి లేదా 10+2 ఉత్తీర్ణత కలిగినవారు అర్హులు. వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలు జాగ్రత్తగా పరిశీలించి, వెంటనే దరఖాస్తు చేయగలరు.
ముఖ్యమైన తేదీలు :
వివరం | తేదీ మరియు సమయం |
---|---|
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం | 4 జనవరి 2025, సాయంత్రం 5:00 గంటలకు |
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు | 3 ఫిబ్రవరి 2025, రాత్రి 11:59 గంటలకు |
మొత్తం ఖాళీలు
- గ్రూప్ ‘C’: 21 పోస్టులు
- గ్రూప్ ‘D’: 40 పోస్టులు
మొత్తం ఖాళీలు: 61 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు
విభాగం | గ్రూప్ ‘C’ పోస్టులు | గ్రూప్ ‘D’ పోస్టులు |
---|---|---|
హెడ్ క్వార్టర్స్ | 21 | 10 |
సికింద్రాబాద్ డివిజన్ | 0 | 5 |
హైదరాబాదు డివిజన్ | 0 | 5 |
విజయవాడ డివిజన్ | 0 | 5 |
గుంటూరు డివిజన్ | 0 | 5 |
గుంతకల్ డివిజన్ | 0 | 5 |
నాందేడ్ డివిజన్ | 0 | 5 |
అర్హతలు
- వయో పరిమితి:
- 18 నుంచి 25 సంవత్సరాలు (01.01.2025 నాటికి).
- 2000 జనవరి 2న లేదా తరువాత జన్మించినవారు మరియు 2007 జనవరి 1న లేదా ముందు జన్మించినవారు మాత్రమే అర్హులు.
- అకాడమిక్ క్వాలిఫికేషన్:
- గ్రూప్ ‘C’: 12వ తరగతి లేదా సమానమైన అర్హత.
- గ్రూప్ ‘D’: 10వ తరగతి లేదా ITI పాసై ఉండాలి.
- క్రీడా ప్రామాణికాలు:
- జాతీయ స్థాయిలో కనీసం మూడవ స్థానం సాధించి ఉండాలి లేదా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలి.
ఎంపిక విధానం
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- క్రీడా నైపుణ్యం ట్రయల్స్ (మొత్తం 40 మార్కులు)
- క్రీడా నైపుణ్యం, ఫిట్‌నెస్ మరియు కోచ్ గమనికలు.
- క్రీడా ప్రదర్శన మరియు విద్యార్హతల ముల్యాంకనం (మొత్తం 60 మార్కులు)
- క్రీడా ప్రదర్శనకు 50 మార్కులు.
- విద్యార్హతలకు 10 మార్కులు.
దరఖాస్తు ప్రక్రియ
- SCR అధికారిక వెబ్‌సైట్ www.scr.indianrailways.gov.in
- ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపడం:
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం స్కాన్ చేయడం తప్పనిసరి.
- డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి:
- విద్యార్హత ధ్రువపత్రాలు.
- క్రీడా ప్రదర్శన ధ్రువపత్రాలు.
- ఆదాయ ధ్రువపత్రాలు (ఎకానమిక్లీ బ్యాక్‌వర్డ్ క్లాస్‌కు).
ఫీజు వివరాలు
సాధారణ అభ్యర్థులు: ₹500
- SC/ST/మహిళలు/మైనారిటీ/EBC అభ్యర్థులు: ₹250 (రిఫండ్ కలదు).
విభాగాల వారీగా క్రీడా విభాగాలు
- అథ్లెటిక్స్: పురుషులు, మహిళలు
- షటిల్ బ్యాడ్మింటన్: సింగిల్స్, డబుల్స్
- బాస్కెట్‌బాల్: అల్లౌండర్స్
- కబడ్డీ: లెఫ్ట్ కవర్, అల్లౌండర్
- వాలీబాల్: సెట్టర్, బ్లాకర్
- క్రికెట్: ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్
- జిమ్నాస్టిక్స్: ఆపరేటస్‌లలో నైపుణ్యం
- ఆర్చరీ: రికర్వ్, కాంపౌండ్
గమనికలు
- అప్లికేషన్ సమర్పణకు ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- అప్లికేషన్ సమర్పణ చివరి తేదీకి ముందే దరఖాస్తు చేయడం మంచిది.
- ఎలాంటి సందేహాలు ఉంటే SCR వెబ్‌సైట్‌లో అందించిన హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి.
Official notification PDF file download