రైల్వే లో 1,003 Govt జాబ్స్ | RRC SECR Recruitment 2025 | Railway Jobs in Telugu

Spread the love

దక్షిణ తూర్పు మధ్య రైల్వే అప్రెంటిస్ నియామక నోటిఫికేషన్ – 2025

Railway Recruitment Cell (RRC) – South East Central Railway (SECR) ద్వారా 1003 Act Apprentices ఖాళీల భర్తీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసుకునే విధంగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఈ అప్రెంటిస్ ప్రోగ్రామ్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అందించబడుతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ప్రత్యేక పరీక్ష లేకుండా, మెట్రిక్ (10వ తరగతి) & ITI మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేసి ఎంపిక చేస్తారు.

అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతలు, ఎంపిక విధానం, వయో పరిమితి, జీతం తదితర పూర్తి వివరాలను క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకుని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

See also  RRB Paramedical Staff Recruitment 2025 – 434 Vacancies Apply Online Now
ముఖ్య సమాచారంవివరాలు
నోటిఫికేషన్ నంబర్E/ PB/ R/ Rectt/ Act Appr./ 01/2025-26
నోటిఫికేషన్ తేదీ03.03.2025
దరఖాస్తు ప్రారంభ తేదీ03.03.2025
దరఖాస్తు ముగింపు తేదీ02.04.2025 (23:59 గంటల వరకు)
అధికారిక వెబ్‌సైట్apprenticeshipindia.gov.in

ఖాళీల వివరాలు:

1. DRM OFFICE, రాయ్‌పూర్ డివిజన్

ట్రేడ్మొత్తం ఖాళీలు
వెల్డర్ (Gas & Elect.)185
టర్నర్14
ఫిట్టర్188
ఎలక్ట్రిషియన్199
స్టెనోగ్రాఫర్ (హిందీ)8
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)13
COPA10
మెషినిస్ట్12
మెకానిక్ డీజిల్34
మెకానిక్ Refrigeration & AC11
మొత్తం734

2. వాగన్ రిపేర్ షాప్, రాయ్‌పూర్

ట్రేడ్మొత్తం ఖాళీలు
ఫిట్టర్110
వెల్డర్110
మెషినిస్ట్15
టర్నర్14
ఎలక్ట్రిషియన్14
COPA4
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)1
స్టెనోగ్రాఫర్ (హిందీ)1
మొత్తం269

అర్హతలు:

1. విద్యార్హత:

  • అభ్యర్థులు 10+2 విధానం కింద 10వ తరగతి ఉత్తీర్ణత (కనీసం 50% మార్కులతో) కలిగి ఉండాలి.
  • సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ తప్పనిసరి.
See also  CSIR CSCMRI Notification 2025 | Latest 12th Pass Govt Jobs

2. వయో పరిమితి:

  • కనీసం 15 సంవత్సరాలు & గరిష్టంగా 24 సంవత్సరాలు (03.03.2025 నాటికి)
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD/Ex-Servicemenలకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంది.

ఎంపిక విధానం:

  • మెట్రిక్యులేషన్ (10వ తరగతి) & ITIలో సాధించిన మార్కుల సగటుతో మెరిట్ లిస్టు తయారు చేస్తారు.
  • రాత పరీక్ష లేకుండా నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం:

  1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (https://apprenticeshipindia.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  2. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి (ఫోటో, సిగ్నేచర్, విద్యార్హత ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం వగైరా).
  3. దరఖాస్తు ఫీజు లేదు.

ముఖ్యమైన సూచనలు:

  • అభ్యర్థులు దరఖాస్తు సమర్పించేటప్పుడు అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
  • ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షలో అర్హత సాధించాలి.
  • ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు.
  • అప్రెంటిస్ శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ హామీ లేదు.

ధరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 02.04.2025

మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ పరిశీలించండి.

See also  Jobs in telugu : ICG Notification Indian Coast Guard Recruitment 2024 apply Now

Download offical Notification

Official wensite

Apply Online


Spread the love

Leave a Comment