CSIR- Central Leather Research Institute Junior Secretariat Assistant Job Notification :
సీఎస్ఐఆర్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) Council of Scientific & Industrial Research Chennai ఇటీవల జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది.ఇందులో 5 అసిస్టెంట్ పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ ఉద్యోగానికి 10+2 అర్హత కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్స్ లో జాయిన్ అవుతానే నెలకు 40 వేల జీతం ఇస్తారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఒక ప్రముఖ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ, ఇది భారతదేశ సైన్సు మరియు టెక్నాలజీ రంగంలో ప్రముఖంగా ఉంది.
“R&D మరియు సహాయక సిబ్బందిలో లింగ సమతుల్యతను ప్రతిబింబించే శ్రామికశక్తిని కలిగి ఉండటానికి CSIR ప్రయత్నిస్తుంది. అందుకోసం మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహిస్తారు.
CSIR నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు : సీఎస్ఐఆర్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI), చెన్నై.
పోస్ట్ పేరు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA).
మొత్తం పోస్టుల సంఖ్య: 5
విద్యార్హతలు:
12వ తరగతి లేదా సరిసమాన అర్హత ఉండాలి అనుభవం అవసరం లేదు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి ,speed టైపింగ్ లో నైపున్యత కావాలి. ఇంగ్లీష్ టైపింగ్ @ 35 w.p.m (లేదా) హిందీ టైపింగ్ @ 30 w.p.m. టైపింగ్ కోసం కేటాయించిన సమయం 10 నిమిషాలు.ఇంగ్లిష్/హిందీని ఎంపిక చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్/హిందీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
పోటీ వ్రాత పరీక్ష పథకం:
రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి (పేపర్ – 1 మరియు పేపర్ – 2). పేపర్ – 2 కోసం మూల్యాంకనం చేయబడుతుంది. పేపర్ – 1 లో కనీస మార్కులను సాధించిన అభ్యర్థులను మాత్రమే సెలెక్ట్ చేసి పేపర్ – 2 ను evaluate చేస్తారు.పేపర్-2లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే తుది మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది.
చదవ వలసిన Syllabus:
పేపర్ -1 (పార్ట్1) | |||
Subject | Number of Questions | Maximum Marks | Negative Marks |
Mental Ability Test*జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జిమెంట్ | 100 | 200 (ప్రతి జవాబుకు 2 మార్కులు | పేపర్ 1 లో నెగెటివే మార్కులు లేవు. |
పేపర్ – 2 (పార్ట్2 ) | |||
General Awareness | 50 | 150 (ప్రతి ఒక్క సరైన సమాధానం కి మూడు మార్కులు) | ప్రతి తప్పు సమాధానం కు ఒక నెగెటివ్ మార్కు |
English Language | 50 | 150 (ప్రతి ఒక్క సరైన సమాధానం కి మూడు మార్కులు) | ప్రతి తప్పు సమాధానం కు ఒక నెగెటివ్ మార్కు |
నెల జీతం
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి పే లెవల్-2 కింద రూ. 19,900 నుంచి 63,200 వరకు చెల్లింపు ఉంటుంది. సుమారుగా నెలకు మొత్తం రూ. 38,483/- చెల్లించబడుతుంది.
వయోపరిమితి: కనిస్ట వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి : 28 సంవత్సరాలు (అప్లై చేసే సమయానికి )
దరఖాస్తు విధానం
అభ్యర్థులు CLRI అధికారిక వెబ్‌సైట్ (https://clri.org) లో లభించే లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు కొత్తగా ఇమెయిల్ ఐడిని సృష్టించుకుని, తమ వివరాలను నమోదు చేయాలి. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాలి.
CSIR దరఖాస్తు రుసుము:
జనరల్ / OBC / EWS వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము 100/- rs చెల్లించాలి, అయితే, SC / ST / PwBD / ESM / మహిళలు / CSIR ఉద్యోగులకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము నుండి మినహాయించబడింది.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో మొదట ప్రాథమిక పరీక్షలు, అనంతరం ప్రొఫిషియెన్సీ పరీక్ష ఉంటాయి. అభ్యర్థులు స్క్రీనింగ్ ప్రక్రియను దాటిన తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.
CLRI Junior Secretariat Assistant ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 02.11.2024
• దరఖాస్తు ముగింపు తేదీ: 01.12.2024
మరింత సమాచారం కోసం CLRI అధికారిక వెబ్‌సైట్ చూడండి.