కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఆశించే అభ్యర్థుల కోసం, ప్రభుత్వ రంగ సంస్థ అయిన Army Ordnance Corps Center నుండి 815 పోస్టుల భారీ నియామకం అధికారికంగా విడుదల చేయబడింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే, మీకు కావలసిన అర్హతలు, వయస్సు పరిమితి, జీతం వివరాలు, పరీక్షా విధానం, దరఖాస్తు చేసే విధానం మరియు ఇతర ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.
ఆఖరి తేదీ తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి, ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించాలని కోరుకునే అభ్యర్థులు, మీకు అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.
జాబితాలో పోస్టు పేరు, ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు, మొత్తం పోస్టులు, మరియు వేతన వివరాలు :
నం | పోస్టు పేరు | రిజర్వేషన్ (UR, EWS, OBC, SC, ST) | మొత్తం ఖాళీలు | ESM కోసం రిజర్వేషన్ | PwBD కోసం రిజర్వేషన్ | వేతన శ్రేణి (7వ వేతన కమిషన్ ప్రకారం) |
---|---|---|---|---|---|---|
(a) | మెటీరియల్ అసిస్టెంట్ (MA) | 10, 01, 05, 02, 01 | 19 | 01 | – | లెవెల్ 5: ₹29,200 – ₹92,300 |
(b) | జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA) | 12, 02, 07, 04, 02 | 27 | 02 | 01 | లెవెల్ 2: ₹19,900 – ₹63,200 |
(c) | సివిల్ మోటార్ డ్రైవర్ (OG) | 03, -, 01, -, – | 04 | – | – | లెవెల్ 2: ₹19,900 – ₹63,200 |
(d) | టెలి ఆపరేటర్ గ్రేడ్-II | 07, 01, 03, 02, 01 | 14 | 01 | – | లెవెల్ 2: ₹19,900 – ₹63,200 |
(e) | ఫైర్‌మాన్ | 102, 24, 66, 37, 18 | 247 | 24 | 09 | లెవెల్ 2: ₹19,900 – ₹63,200 |
(f) | కార్పెంటర్ & జోయినర్ | 05, -, 01, 01, – | 07 | – | – | లెవెల్ 2: ₹19,900 – ₹63,200 |
(g) | పేయింటర్ & డెకరేటర్ | 04, -, 01, -, – | 05 | – | – | లెవెల్ 2: ₹19,900 – ₹63,200 |
(h) | MTS | 07, 01, 02, 01, – | 11 | 01 | – | లెవెల్ 1: ₹18,000 – ₹56,900 |
(i) | ట్రేడ్‌స్మాన్ మేట్ | 159, 38, 105, 58, 29 | 389 | 38 | 15 | లెవెల్ 1: ₹18,000 – ₹56,900 |
గమనిక: ఈ పోస్టుల కొరకు అభ్యర్థుల ఎంపిక 7వ వేతన కమిషన్ నిబంధనల ప్రకారం జరుగుతుంది.
ఫైర్‌మాన్ (Fireman) పోస్టులకు అర్హతలు:
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు నిబంధనల ప్రకారం ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
కార్పెంటర్ & జోయినర్ (Carpenter & Joiner) పోస్టులకు అర్హతలు:
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు నిబంధనల ప్రకారం ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
గుర్తింపు పొందిన ఐటీఐ (ITI) నుండి 3 సంవత్సరాల శిక్షణ పొందిన సర్టిఫికేట్ ఉండాలి లేదా ఆయా పనిలో అనుభవం ఉండాలి.
పెయింటర్ & డెకరేటర్ (Painter & Decorator) పోస్టులకు అర్హతలు:
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు నిబంధనల ప్రకారం ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
గుర్తింపు పొందిన ఐటీఐ (ITI) నుండి 3 సంవత్సరాల శిక్షణ పొందిన సర్టిఫికేట్ ఉండాలి లేదా ఆయా పనిలో అనుభవం ఉండాలి.
ఎంటీఎస్ (MTS) పోస్టులకు అర్హతలు:
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు నిబంధనల ప్రకారం ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
ప్రాధాన్యత: ఆయా ట్రేడ్‌లకు సంబంధించిన పనుల్లో ఒక సంవత్సర అనుభవం ఉండాలి.
ట్రేడ్‌స్మాన్ మేట్ (Tradesman Mate) పోస్టులకు అర్హతలు:
వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు నిబంధనల ప్రకారం ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణత లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
ప్రాధాన్యత: గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) నుండి ఏదైనా ట్రేడ్‌లో సర్టిఫికేట్ ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి, ప్రభుత్వ సంస్థ అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాత నోటిఫికేషన్‌లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్షలో మెరుగైన ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసి, ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
JOB Apply చేసుకునే ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు మీరు 2nd December నుండి 22nd December వరకు Online / Offline లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆలస్యం చేసినవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.
Apply online for Army AOC job Notification 2024.