ఇన్కమ్ టాక్స్ అప్పీల్స్ ట్రిబ్యునల్ ఉద్యోగ అవకాశాలు
ఇన్కమ్ టాక్స్ అప్పీల్స్ ట్రిబ్యునల్ గ్రూప్ బి స్థాయి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ (15 పోస్టులు) మరియు ప్రైవేట్ సెక్రటరీ (20 పోస్టులు) ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి, నిమిషానికి 120 పదాలు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ రాయగల సామర్థ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దరఖాస్తు చేయవచ్చు.
పోస్ట్‌ల వివరాలు ఖాళీలు:-
- సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ- 15 (SC-02, ST-00, OBC-01, EWS-03, Gen.-09) (PWD: 01)
- ప్రైవేట్ సెక్రటరీ- 20 (SC-02, ST-01, OBC-09, EWS-00, Gen.-08) (క్షితిజసమాంతర ఖాళీ – PWD: 01)
అర్హతలు:(Income Tax Dept. Job Notification 2024 )
- వయసు: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసివుండాలి.
- నైపుణ్యం: ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ రైటింగ్‌లో నిమిషానికి 120 పదాలు రాయగలగాలి.
- కంప్యూటరు స్కిల్స్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ , పేజీ మేకర్ లాంటి software లలో అవగాహన ఉండాలి.
సెలెక్షన్ విధానం:
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటాయి. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష (జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ & రీజనింగ్ పేపర్లు) మరియు స్కిల్ టెస్ట్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే నిర్వహించబడతాయి.
రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందడం తప్పనిసరి:
- జనరల్ కేటగిరీకి: 50%
- ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి: 45%
- ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడి కేటగిరీలకు: 40%
రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకే స్కిల్ టెస్ట్ చేయబడుతుంది.
స్కిల్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత, ఎంపికైన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి సంబంధించిన తేదీ మరియు ప్రదేశం తరువాత తెలియజేయబడుతుంది.
నియామక ప్రక్రియ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడుతుంది.
Examination Centers for Income Tax Dept. Job Notification
రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ క్రింది 8 కేంద్రాల్లో నిర్వహించబడతాయి:
(i) ఢిల్లీ
(ii) ముంబై
(iii) కోలకతా
(iv) చెన్నై
(v) బెంగళూరు
(vi) గువాహటి
(vii) లక్నో
(viii) అహ్మదాబాద్
అభ్యర్థులు తమ ప్రాధాన్యత క్రమంలో రెండు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. అయితే, ఏదైనా పరీక్షా కేంద్రానికి తగినంత దరఖాస్తులు రాకపోతే, ఆ కేంద్రాన్ని రద్దు చేసే అధికారం ఇన్కమ్ టాక్స్ అప్పీల్స్ ట్రిబ్యునల్కు ఉంటుంది. అటువంటి సందర్భంలో, అభ్యర్థి ఎంపిక చేసిన రెండో కేంద్రంలో పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది.
జీతం మరియు ప్రయోజనాలు:
సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ గా ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹47,600/- నుండి ₹1,51,100/- వరకు జీతం చెల్లించబడుతుంది. అలాగే ప్రైవేట్ సెక్రటరీ గా ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹44,900/- నుండి ₹1,42,400/- వరకు జీతం ఇస్తారు . అదనంగా ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు కూడా అందిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పంపవచ్చు.
- నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
- అవసరమైన సర్టిఫికేట్లతో పాటు దరఖాస్తు ఫారం పూర్తి చేయండి.
- దరఖాస్తును ముంబైలోని ఇన్కమ్ టాక్స్ అప్పీల్స్ ట్రిబ్యునల్ కార్యాలయానికి పోస్ట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 5, 2024 లోపు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో పూర్తి చేసి, అవసరమైన సర్టిఫికెట్లు, విద్యార్హత పత్రాలు, మరియు స్టడీ సర్టిఫికెట్లను కలిపి ముంబైలోని ఇన్కమ్ టాక్స్ అప్పీల్స్ ట్రిబ్యునల్ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపించాలి.
అవసరమైన సర్టిఫికేట్లు:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
- డిగ్రీ సర్టిఫికెట్ మరియు మార్క్స్ మెమో.
- స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు.
అప్లికేషన్ ఫీజు:
ఈ నోటిఫికేషన్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
మరింత సమాచారం కోసం:
నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి మీ అర్హతలను నిర్ధారించుకొని వెంటనే దరఖాస్తు చేయండి.