Income Tax Appellate Tribunal (ITAT) – సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ / ప్రైవేట్ సెక్రటరీ ( both Group ‘B’ Gazetted) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం Income Tax Department Jobs 2024 | Latest Govt Jobs In Telugu
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! ఇండియా లా & జస్టిస్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) వారు సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ మరియు ప్రైవేట్ సెక్రటరీ పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలు వివిధ ప్రాంతీయ ITAT Benches లలో అందుబాటులో ఉన్నాయి. 22 వ Octomber 2024 నుండి ధరకస్థులు స్వీకరిస్తున్నారు. ఇది Offline అప్లికేషన్ విధానం ఉంటుంది.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు వివరాలు:
- సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ (గ్రూప్ ‘B’ గెజిటెడ్)
- ఖాళీలు: 15
(SC – 2, OBC – 1, EWS – 3, జనరల్ – 9; PWD – 1 హారిజాంటల్ ఖాళీ) - జీతం: ₹47,600 – ₹1,51,100 (పే లెవల్-8)
- ప్రైవేట్ సెక్రటరీ (గ్రూప్ ‘B’ గెజిటెడ్)
- ఖాళీలు: 20
(SC – 2, ST – 1, OBC – 9, జనరల్ – 8; PWD – 1 హారిజాంటల్ ఖాళీ) - జీతం: ₹44,900 – ₹1,42,400 (పే లెవల్-7)
అర్హతలు మరియు షరతులు:
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి .
- అనుభవం: 120 పదాలు/నిమిషం వేగంతో ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం: మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్ ఇంకా పేజీ మేకర్ వంటి సాఫ్ట్‌వేర్‌లపై పని చేయగలగాలి.
- వయస్సు: దరఖాస్తుదారుల వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
ఎంపిక రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష (Skill Test ) మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.
- రాత పరీక్ష:
- జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ & రీజనింగ్.
- నైపుణ్య పరీక్షలో 120 wpm ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్, 45 wpm ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలి.
- కేంద్రాలు: ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, గువాహటి, లక్నో మరియు అహ్మదాబాద్.
ముఖ్య గమనిక :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి ప్రాధాన్యతా క్రమం ప్రకారం తమకు నచ్చిన రెండు కేంద్రాలను ఎంచుకోవాలి. ఏదైనా నిర్దిష్ట పరీక్ష కేంద్రంలో తగిన సంఖ్యలో దరఖాస్తులు అందకపోతే, అటువంటి కేంద్రాన్ని రద్దు చేసే అధికారాన్నిIncome Tax Appellate Tribunal (ITAT) కలిగి ఉంటుంది మరియు అభ్యర్థి అతను/ఆమె ఎంచుకున్న రెండవ కేంద్రంలో హాజరుకావలసి ఉంటుంది.
పరీక్షా విధానం & మార్కులు:
WRITTEN EXAMINATION | |||
Sl. No. | Test | Marks | Syllabus |
1 | Paper-1: General English | 100 | Essay of minimum 250 words, Letter Writing,Precise Writing and Grammar. |
2 | Paper-2: General knowledge&Reasoning | 100 | General knowledge/General Studies, LogicalReasoning,CurrentAffairs. |
Skill Test | |||
1 | Skill Test | 100 | EnglishShorthand@120WPM English Typing@45WPM |
PERSONAL INTERVIEW | |||
1 | PERSONAL INTERVIEW | 50 | |
Total Marks | 350 |
Income Tax Department Jobs 2024
Written Examination, Skill Test రెండు ఇంగ్షీషు మీడియం లోనే ఉంటాయి.
అభ్యర్థులు వ్రాత పరీక్షలో కనీస అర్హత మార్కులను పొందాలి (జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 50%, OBC/ EWS వర్గానికి చెందిన అభ్యర్థులకు 45% మరియు SC/ST/PWD వర్గాలకు చెందిన అభ్యర్థులకు 40%). వ్రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే స్కిల్ టెస్ట్ నిర్వహించబడుతుంది. స్కిల్ టెస్ట్ తర్వాత షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. దానికి సంబంధించిన తేదీ మరియు వేదిక తర్వాత తెలియజేయబడుతుంది.
ముఖ్య సూచనలు:
- అభ్యర్థులు తమ పూర్తి వివరాలు పత్రాల్లో స్వీయ సాక్ష్యపూర్వక పత్రాలతో పంపాలి.
- అభ్యర్థులు 45 రోజులలోపు దరఖాస్తు చేయాలి.
- అభ్యర్థులు నిర్దేశించిన ఫార్మాట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఎలా పంపాలి:
అభ్యర్థులు తమ దరఖాస్తులను, అవసరమైన పత్రాలతో కలిపి, కింది చిరునామాకు పంపాలి:
డిప్యూటీ రిజిస్ట్రార్, ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ప్రతిష్ట భవన్, ముంబై – 400020
అప్లికేషన్ ప్రకటన తేదీ నుండి 45 రోజుల లోపు దరఖాస్తులు ముందు తెలిపిన అడ్రసు కు చేరుకోవాలి.
నోటిఫికటివ్ మరియు అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ కొరకు https://www.itat.gov.in ను విజిట్ చేయండి.