ఢిల్లీ సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) ద్వారా ఢిల్లీ హైకోర్ట్లో Chauffeur (డ్రైవర్) మరియు Despatch Rider-cum-Process Server పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 20 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కనీస అర్హత మ్యాట్రిక్యులేషన్ / హయ్యర్ సెకండరీ కాగా, సరైన డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవం తప్పనిసరి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 26 ఆగస్టు 2025 నుండి 24 సెప్టెంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఢిల్లీ హైకోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్ 2025
ప్రకటన నం: 04/2025
జారీ తేదీ: 21-08-2025
అప్లికేషన్ ప్రారంభం: 26-08-2025 (మధ్యాహ్నం 12 గంటల నుండి)
చివరి తేదీ: 24-09-2025 (రాత్రి 11:00 వరకు)
దరఖాస్తు వెబ్‌సైట్: https://dsssbonline.nic.in
ఖాళీల వివరాలు:
| పోస్టు పేరు | పోస్టు కోడ్ | కేటగిరీ | UR | OBC | SC | ST | EWS | మొత్తం | ESM |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Chauffeur (డ్రైవర్) | 53/25 | Group-C | 05 | 02 | 01 | 00 | 00 | 08 | 01 |
| Despatch Rider-cum-Process Server | 54/25 | Group-C | 07 | 03 | 01 | 00 | 01 | 12 | 01 |
| మొత్తం ఖాళీలు: 20 |
అర్హతలు:
Chauffeur (డ్రైవర్):
- కనీస విద్యార్హత: మ్యాట్రిక్యులేషన్ / హయ్యర్ సెకండరీ పాస్.
- లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
- కనీసం 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
- ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం.
Despatch Rider-cum-Process Server:
- కనీస విద్యార్హత: మ్యాట్రిక్యులేషన్ / హయ్యర్ సెకండరీ పాస్.
- లైట్ మోటార్ వెహికిల్ లేదా మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
- కనీసం 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
వయస్సు పరిమితి:
- కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు (01-01-2025 నాటికి).
- జననం తేదీలు 02-01-1998 నుండి 01-01-2007 మధ్యలో ఉండాలి.
వయస్సు రాయితీలు:
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
- Ex-Servicemen (Group-B & Group-C): సర్వీస్ కాలం + 3 సంవత్సరాలు (గరిష్టంగా 55 సంవత్సరాలు)
జీతం:
- లెవల్ – 5, 7వ CPC ప్రకారం (Group-C పోస్టులు)
ఎంపిక విధానం:
Chauffeur (డ్రైవర్):
- ప్రిలిమినరీ ఎగ్జామ్ (MCQ – 100 మార్కులు, 90 నిమిషాలు)
- డ్రైవింగ్ స్కిల్స్, రోడ్డు సేఫ్టీ, నావిగేషన్, GPS, మెకానికల్ నాలెడ్జ్.
- ప్రతీ తప్పు సమాధానానికి 0.50 మార్కులు నెగటివ్ మార్కింగ్.
- కనీస అర్హత మార్కులు:
- జనరల్: 50/100
- SC/ST/OBC/ESM: 45/100
- స్కిల్ టెస్ట్ (100 మార్కులు)
- సిమ్యులేటర్ డ్రైవింగ్ టెస్ట్ – 50 మార్కులు
- రియల్ ట్రాఫిక్ డ్రైవింగ్ టెస్ట్ – 50 మార్కులు
- కనీస అర్హత మార్కులు: జనరల్ – 25/50, రిజర్వ్ కేటగిరీ – 22.5/50
- ఇంటర్వ్యూ – 15 మార్కులు
Despatch Rider-cum-Process Server:
- ప్రిలిమినరీ ఎగ్జామ్ (MCQ – 100 మార్కులు, 90 నిమిషాలు)
- డ్రైవింగ్ స్కిల్స్, రోడ్డు సేఫ్టీ, GPS, మెకానికల్ నాలెడ్జ్.
- నెగటివ్ మార్కింగ్ 0.50 మార్కులు.
- కనీస అర్హత మార్కులు: జనరల్ – 50/100, రిజర్వ్ – 45/100
- స్కిల్ టెస్ట్ (150 మార్కులు)
- స్కూటీ డ్రైవింగ్ రియల్ ట్రాఫిక్‌లో – 75 మార్కులు
- బైక్ డ్రైవింగ్ రియల్ ట్రాఫిక్‌లో – 75 మార్కులు
- కనీస అర్హత మార్కులు: జనరల్ – 37.5/75, రిజర్వ్ – 33.75/75
- ఇంటర్వ్యూ – 15 మార్కులు
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు ముందుగా DSSSB పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
- ఒక్కసారే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది. డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు రద్దు అవుతాయి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంలో ఉన్న వివరాలను సరిగ్గా నింపాలి. సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు ఉండవు.
- దరఖాస్తు చివరి తేదీ: 24-09-2025 రాత్రి 11:00 గంటల వరకు.
ఫీజు వివరాలు:
- దరఖాస్తు ఫీజు: ₹100/- (SBI e-pay ద్వారా మాత్రమే)
- మినహాయింపు: మహిళలు, SC, ST, PwBD, Ex-Servicemen
ముఖ్య సూచనలు:
- పోస్టు/ఈమెయిల్/హ్యాండ్ ద్వారా పంపిన అప్లికేషన్లు అంగీకరించబడవు.
- DSSSB, Delhi High Court వెబ్‌సైట్లను రెగ్యులర్‌గా చూడాలి.
- తప్పుడు సమాచారం, మోసం, ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్లయితే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది.
ferquently asked question
Q1: ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
A1: మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి.
Q2: Chauffeur (డ్రైవర్) పోస్టుకు కనీస అర్హత ఏమిటి?
A2: మ్యాట్రిక్యులేషన్/హయ్యర్ సెకండరీ మరియు LMV డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
Q3: అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు?
A3: 24 సెప్టెంబర్ 2025 రాత్రి 11:00 గంటల వరకు.
Q4: దరఖాస్తు ఫీజు ఎంత?
A4: ₹100 (SC, ST, మహిళలు, PwBD, Ex-Servicemen కి ఫీజు మినహాయింపు).
👉 అర్హులైన అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2025 లోపు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ఢిల్లీ హైకోర్ట్‌లో స్థిరమైన ఉద్యోగ అవకాశం లభించనుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ద్వారానే జరగనుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీకి ముందు వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలి.
