తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న 316 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణా ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు విడుదల చేశారు. ఇందులో వివిధ పోస్టులు, అదనంగా గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, జూనియర్ అసిస్టెంట్స్, శానిటరీ ఇన్స్పెక్టర్లు వంటి ఉద్యోగాలున్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన, ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు మరియు అర్హతలు:
Sl.no | Job title | No.of Posts |
---|---|---|
1 | గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్లు | 7 పోస్టులు |
2 | గ్రేడ్ 2 అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్లు: | 43 పోస్టులు |
3 | గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్లు | 41 పోస్టులు |
4 | హెల్త్ ఆఫీసర్లు | 7 పోస్టులు |
5 | రెవెన్యూ మేనేజర్లు | 11 పోస్టులు |
6 | శానిటరీ సూపర్వైజర్లు | 10 పోస్టులు |
7 | శానిటరీ ఇన్స్పెక్టర్లు | 86 పోస్టులు |
8 | హెల్త్ అసిస్టెంట్లు | 96 పోస్టులు |
9 | జూనియర్ అసిస్టెంట్లు | 15 పోస్టులు |
Total | మొత్తం | 316 పోస్టులు |
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం ఏదైనా డిగ్రీ (Degree qualification jobs)లేదా సంబంధిత అంశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. కొంతమంది పోస్టులకు అనుభవం కూడా అవసరం కావచ్చు.
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
పురపాలక శాఖలో పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించి, జిల్లాలలోనే పరీక్షలు నిర్వహించి, ఆయా జిల్లాలలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.45,000 వరకు జీతం ఉంటుంది. ఈ జీతంతోపాటు అన్ని రకాల అలవెన్సులు, బెనిఫిట్లు కూడా ఉంటాయి.
నోటిఫికేషన్ విడుదల తేదీ:
తెలంగాణా ప్రభుత్వం శనివారం రోజు పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.