Bank Jobs : Union Bank of India Local Bank Officer (LBO) job notification 1500 vacancies in Telugu 2024

Spread the love

Union Bank of India Local Bank Officer (LBO) job notification 1500 vacancies recruitment in Telugu apply online now 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) మొట్టమొదటిసారిగా తమ బ్యాంకులో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం స్థానిక యూనియన్ బ్యాంకులో పనిచేయడానికి స్థానిక బ్యాంక్ అధికారులు (Local Bank Officer  – LBO) పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయించుకుంది. దీనికోసం గాను 23 అక్టోబర్ 2024 న  అధికారికంగా 1500 పోస్టుల లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 2024 అక్టోబర్ 24 నుండి 2024 నవంబర్ 13 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు .

అయితే ఈ Union Bank of India Local Bank Officer (LBO) స్థానిక బ్యాంక్  అధికారులు (LBO) జాబ్ అప్లై చేసుకోవడానికి కావలసిన అర్హతలు ఏంటి ? ఫీజు ఎంత? ఎన్ని జాబ్స్ ఉన్నాయి? రిజర్వేషన్స్?  ఏంటి పరీక్ష విధానం ఏంటి ?పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో పొందుపరచబడ్డాయి క్లియర్ గా చదివి జాబ్ కి అప్లై చేసుకోండి.

ఉద్యోగం పేరు

స్థానిక బ్యాంకు అధికారి (Local Bank Officer – LBO) ఈ ఉద్యోగం మనకు లోకల్ గా ఉండేటువంటి యూనియన్ బ్యాంక్ లోనే కేటాయించబడుతుంది సో ఊర్లోనే ఒక గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు . ఇంకా ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయబడ్డ ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer(PO) స్థాయి పోస్టు.

See also  AP, TS ఆధార్ సెంటర్స్ లో ఆపరేటర్ ఉద్యోగాలు | Aadhar Center Jobs Notification 2025

ఈ స్థానిక బ్యాంక్ అధికారి చేసే పని ఏమై ఉండవచ్చు అంటే బ్యాంకులో చెక్‌బుక్‌లు, ATM కార్డ్‌లు మరియు డిమాండ్ డ్రాఫ్ట్‌లను జారీ చేయడం, ఖాతాలలో వ్యత్యాసాల కోసం తనిఖీ చేయడం, అన్ని రకాల కస్టమర్ ప్రశ్నలను పూర్తి చేయడం లాంటి ఉంటాయి. 

ఖాళీ వివరాలు

Union Bank of India  ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 స్థానిక బ్యాంకు అధికారుల  (Local Bank Officer – LBO) /(PO ) ఖాళీలు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ పోస్టులు బ్యాంకింగ్ రంగంలో ప్రొఫెషనల్ కెరీర్‌ను ఆశించే అభ్యర్థులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తాయి. 

ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన పోస్టుల సంఖ్య

అయితే ఆంధ్రప్రదేశ్ లో మనకి 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో ఓబీసీకి (OBC) 54 పోస్టులు కేటాయించబడ్డాయి జనరల్ కేటగిరీకి 81 పోస్టులు కేటాయించారు మిగిలినవన్నీ స్పెషల్ కేటగిరీకి కేటాయించబడ్డాయి అంటే ఎస్సీ, ఎస్టీ ,EWS ,PwBDs వారికి ఇచ్చారు .

See also  NICL AO Recruitment 2025:266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్టుల నోటిఫికేషన్

తెలంగాణకి కేటాయించబడ్డ పోస్టుల సంఖ్య

 అదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికొస్తే అక్కడ కూడా 200 పోస్టులు కేటాయించబడ్డాయి అందులో ఓబీసీకి 54 జనరల్ కేటగిరీకి 81 పోస్టులు మిగిలినవి స్పెషల్ క్యాటగిరి కి కేటాయించబడ్డాయి అంటే ఎస్సీ, ఎస్టీ ,EWS ,PwBDs అన్నమాట 

SNStateMandatory Language ProficiencyVacanciesSCSTOBCEWSURTotalVIHIOCID & Others
1Andhra PradeshTelugu20030155420812002222
8Tamil NaduTamil20030155420812002222
ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కేటాయించబడ్డ పోస్ట్లు వాటి వివరాలు మాత్రమే ఈ టేబుల్ లో జతపరిచాము మిగిలిన రాష్ట్రాల్లోని పోస్టుల వివరాలు కోసం మీరు అఫీషియల్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ ని చూడాల్సి ఉంటుంది లింకు ఇక్కడ ఉంది క్లిక్ చేయండి.

Total Vacancies: 1500
SC: 224 | ST: 109 | OBC: 404 | EWS: 150 | UR: 613
PwBDs (Persons with Benchmark Disabilities): VI: 15 | HI: 16 | OC: 15 | ID & Others: 14

Let me know if you’d like any further changes!

విద్య అర్హత

Union Bank of India Local Bank Officer (LBO)జాబ్ కి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంకా వేరే క్వాలిఫికేషన్ ఏమీ మెన్షన్ చేయలేదు సో డిగ్రీ పాస్ అయిన వారందరూ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. 

వయోపరిమితి

అభ్యర్థుల వయస్సు 2024 అక్టోబర్ 1 నాటికి కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు రాయితీలు అందుబాటులో ఉంటాయి:

  • SC, ST కేటగిరీలకు రాయితి: 5 సంవత్సరాలు
  • OBC (నాన్-క్రీమీ లేయర్) కోసం: 3 సంవత్సరాలు
  • PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
See also  10 th pass government jobs Boarder Roads Organization Job Vaccancy Notification 2024 

దరఖాస్తు రుసుము(Applictaion Fees)

దరఖాస్తు రుసుము వివరాలు కింది విధంగా ఉన్నాయి:

  • జనరల్, EWS, OBC: ₹850/-
  • SC, ST, PWD: ₹175/- 

ఈ రుసుమును 2024 అక్టోబర్ 24 నుండి 2024 నవంబర్ 13 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి (How to Apply online)

అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ unionbankofindia.co.in కి వెళ్లి అందులో ఇచ్చిన దరఖాస్తు లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2024 అక్టోబర్ 24 నుండి ప్రారంభమై 2024 నవంబర్ 13 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తగినపరిగా వివరాలను పూరించి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:

  • గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డు, లేదా వోటర్ ఐడీ)
  • విద్యా అర్హత సర్టిఫికెట్లు
  • వయస్సు ధృవీకరణ పత్రం
  • కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/OBC/PWD అభ్యర్థుల కోసం)
  • అనుభవ సర్టిఫికెట్ (అనుభవం ఉన్న వారికి)
  • ఈ డాక్యుమెంట్లు డిజిటల్ ఫార్మాట్‌లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ముఖ్యమైన తేదీ

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 2024 అక్టోబర్ 23
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2024 అక్టోబర్ 24
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024 నవంబర్ 13
  • పరీక్ష తేదీ: త్వరలో తెలియజేయబడుతుంది
పరీక్షల నిర్వహించే కేంద్రాల వివరాలు:

మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 15 పరీక్ష కేంద్రాలని (Examination Centers) ఏర్పాటు చేశారు

1.అమరావతి, 2.అనంతపురం, 3.ఏలూరు, 4.గుంటూరు,5.విజయవాడ, 6.కడప, 7.కాకినాడ, 8.కర్నూలు, 9.నెల్లూరు, 10.ఒంగోలు, 11.రాజమండ్రి, 12.శ్రీకాకుళం,13.తిరుపతి, 14.విశాఖపట్నం, 15.విజయనగరం.

అదేవిధంగా తెలంగాణలో కూడా 5 పరీక్ష కేంద్రాలను (Examination Centers) ఏర్పాటు చేశారు 

1.హైదరాబాద్, 2.సికింద్రాబాద్, 3.కరీంనగర్,4.ఖమ్మం, 5.వరంగల్

ఎంపిక విధానం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LBO పోస్టులకు ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది:

  • వ్రాత పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ
  • స్థానిక భాషా పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

అభ్యర్థులు మొదట వ్రాత పరీక్షను ఉత్తీర్ణులు అయితే, తదుపరి దశలకు అర్హులవుతారు. ఎంపిక ప్రక్రియలో ప్రతిదశలో అర్హత సాధించిన వారికి స్థానిక భాషా పరీక్ష కూడా నిర్వహించబడుతుంది.

Union Bank of India Local Bank Officer Online Exam  యొక్క సమయం, విధానము  మరియు వివరముల పట్టిక:

SNపరీక్షల పేర్లు (క్రమం ప్రకారం కాదు)ప్రశ్నల సంఖ్యగరిష్ట మార్కులుపరీక్ష భాషప్రతి పరీక్షకు కేటాయించిన సమయం (ప్రత్యేకంగా కేటాయించినది)
1రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్
4560ఇంగ్లీష్ / హిందీ60 నిమిషాలు
2సాధారణ / ఆర్థిక / బ్యాంకింగ్ అవగాహన4040ఇంగ్లీష్ / హిందీ35 నిమిషాలు
3డేటా ఎనాలసిస్ & ఇంటర్ప్రిటేషన్
3560ఇంగ్లీష్ / హిందీ45 నిమిషాలు
4ఇంగ్లీష్ భాష3540ఇంగ్లీష్40 నిమిషాలు
మొత్తం155200180 నిమిషాలు
5 లెటర్ అండ్ ఎస్సే రైటింగ్
225ఇంగ్లీష్30 నిమిషాలు

Online Apply Click


Spread the love

Leave a Comment