ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ రేషన్ డీలర్ నోటిఫికేషన్-Andhra Pradesh Revenue Department job recruitment :
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కొత్తగా రేషన్ డీలర్ల నియామకానికి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కోసం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ అర్హులు. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అవసరం లేదు. ఎంతో సరళమైన ప్రక్రియతో దరఖాస్తు చేయడం ద్వారా సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. టెక్కలి డివిజన్ పరిధిలో కొత్తగా 59 చౌక ధరల దుకాణాలకు డీలర్లను నియమించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆర్గనైజేషన్ వివరాలు
- సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ
- ప్రాధాన్యత: చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకం
- ప్రాంతం: విజయవాడ డివిజన్, టెక్కలి డివిజన్
ఖాళీల వివరాలు
విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ సర్కిళ్లలో ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెక్కలి డివిజన్ పరిధిలో మొత్తం 59 చౌక ధరల దుకాణాలలో 46 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: Andhra Pradesh Revenue Department job recruitment apply online now
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
- అభ్యర్థులు స్థానిక ప్రాంతానికి చెందినవారై ఉండాలి
- నిరుద్యోగులు అయి ఉండాలి
- ఎటువంటి నేరపూరిత చరిత్ర లేకుండా క్లియర్ గా ఉండాలి
వయోపరిమితి:
- సాధారణ అభ్యర్థులకు: 18-40 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: 18-45 సంవత్సరాలు
దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్‌లు
- విద్యార్హత సర్టిఫికేట్ (ఇంటర్మీడియట్)
- జన్మతిది ధ్రువీకరణ పత్రం
- స్థానికత ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం (అవర కేటగిరీకి మాత్రమే)
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (2 నకలు)
ముఖ్యమైన తేదీలు
చేయవలసినది | తేదీ |
---|---|
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబరు 26, 2024 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 9, 2025 |
రాత పరీక్ష ఫలితాలు | జనవరి 23, 2025 |
ఇంటర్వ్యూల తేదీలు | జనవరి 27, 2025 |
తుది ఫలితాలు | జనవరి 30, 2025 |