ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రటేరియట్ RTGS లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | AP Amaravati Secretariat RTGS Jobs Notification 2025

Spread the love

AP Amaravati Secretariat RTGS Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) లో 66 పోస్టుల భర్తీకి కాంట్రాక్టు పద్ధతిలో నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాథమికంగా ఈ నియామకం ఒక సంవత్సరం పాటు ఉంటుంది, అయితే అభ్యర్థుల పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల వయసు 18 నుండి 56 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే, 3 నుండి 10 సంవత్సరాల అనుభవం కలిగిన వారు అర్హులు. అర్హతలు ఉన్న అభ్యర్థులు, RTGS రిక్రూట్మెంట్ వివరాలను చదివి, త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాలు, పోస్టుల సంఖ్య:

పోస్టుల డిపార్ట్మెంట్పోస్టుల సంఖ్య
RTGS02
AWARE హబ్03
RTGS అడ్మినిస్ట్రేషన్07
డేటా ఇంటిగ్రేషన్ & ఎనలిటిక్స్ హబ్08
ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్06
AI & డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్10
పీపుల్స్ పెరసెప్షన్ హబ్20
మల్టీ సోర్స్ విసుయల్ ఇంటలిజెన్స్ హబ్10
మొత్తం పోస్టులు66

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ RTGS డిపార్ట్మెంట్ ద్వారా 66 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ: 11 జనవరి 2025
  • అప్లికేషన్ చివరి తేదీ: 25 జనవరి 2025
See also  Delhi High Court Recruitment 2025 – Chauffeur & Despatch Rider Posts

పోస్టుల వివరాలు & అర్హతలు:

ఏపీ సచివాలయంలోని RTGS డిపార్ట్మెంట్‌లో 66 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో చీఫ్ డేటా & సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, మేనేజర్, డేటా ఎనలిస్ట్, జనరల్ మేనేజర్, డేటా ఆర్చిటెక్ట్ వంటి విభిన్న రకాల పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హతలను కలిగి ఉండాలి. అలాగే, పోస్టును అనుసరించి 3 నుండి 10 సంవత్సరాల అనుభవం ఉండటం అవసరం. 18 నుండి 56 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు

18 నుండి 56 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కాంట్రాక్టు పద్ధతిలోని ఉద్యోగాలు కావున వయో పరిమితిలో ఎటువంటి సడలింపు ఉండదు.

సెలక్షన్ ప్రాసెస్:

ఏపీ RTGS డిపార్ట్మెంట్ ఉద్యోగాల కోసం ఎటువంటి రాత పరీక్ష లేదా అప్లికేషన్ ఫీజు అవసరం లేదు. అర్హతలు, వయస్సు, ముఖ్యంగా సంబంధిత అనుభవం ఆధారంగా అభ్యర్థుల డాక్యుమెంట్లు పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది.

See also  3,000+ పోస్టులతో 10th, Inter pass భారీగా Govt జాబ్స్ | AIIMS CRE Notification 2025 

శాలరీ వివరాలు:

RTGS డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు శాలరీ ఉంటుంది. ఇది పోస్టును అనుసరించి మారుతుంది. అయితే, ఇతర అలవెన్సులు లేదా బెనిఫిట్స్ అందుబాటులో ఉండవు.

అప్లికేషన్ విధానం:
  1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ బయో డేటా/CV ని నోటిఫికేషన్‌లో ఇచ్చిన Mail అడ్రస్ (jobs-rtgs@ap.gov.in) కు పంపించాలి.
  2. అభ్యర్థులు తమ ఇమెయిల్ ద్వారా పై మెయిల్ అడ్రస్‌ కు దరఖాస్తు పంపించాలి.

అప్లికేషన్‌కు అవసరమైన సర్టిఫికెట్లు:

  • అభ్యర్థి యొక్క CV/బయో డేటా ఫారం
  • సంబంధిత అర్హతల సర్టిఫికెట్లు
  • కుల ధ్రువీకరణ పత్రాలు
  • అనుభవ సర్టిఫికెట్లు (కచ్చితంగా అవసరం)

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ RTGS డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.ఆంధ్రప్రదేశ్ RTGS పోస్టులకి మహిళలు, పురుషులు అందరూ Apply చేసుకోవచ్చు.

Apply Link


Spread the love

Leave a Comment