భారత ప్రభుత్వం కస్టమ్స్ విభాగం – గ్రూప్ ‘C’ ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్
Revenue Dept. Notification 2025 భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవిన్యూ విభాగం నుండి 14 సీమాన్, గ్రీజర్, ట్రేడ్స్‌మన్, తిండల్, ఇంజిన్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కస్టమ్స్ మరీన్ విభాగం, కస్టమ్స్ కమిషనరేట్, గోవా పరిధిలో గ్రూప్ ‘C’ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులలో ఖాళీలు భర్తీ చేయబడతాయి.
పోస్టుల వివరాలు
సీరియల్ నం | పోస్టు పేరు | ఖాళీలు | వయస్సు పరిమితి |
---|---|---|---|
01 | సీమన్ | 03 (SC-01, ST-00, OBC-01, UR-03) | 18 నుండి 25 సంవత్సరాలు |
02 | గ్రీజర్ | 08 (SC-01, ST-01, OBC-02, EWS-00, UR-01) | 18 నుండి 25 సంవత్సరాలు |
03 | ట్రేడ్స్‌మన్ | 01 (UR-01) | 18 నుండి 25 సంవత్సరాలు |
04 | టిండాల్ | 01 (UR-01) | 18 నుండి 35 సంవత్సరాలు |
05 | ఇంజిన్ డ్రైవర్ | 01 (UR-01) | 18 నుండి 35 సంవత్సరాలు |
వయస్సు సడలింపు
- OBC (నాన్ క్రీమీ లేయర్): రిజర్వ్ చేసిన పోస్టులకు గరిష్ట వయస్సు 3 సంవత్సరాలు సడలింపు.
- SC/ST అభ్యర్థులకు: రిజర్వ్ చేసిన పోస్టులకు గరిష్ట వయస్సు 5 సంవత్సరాలు సడలింపు.
- కేంద్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు: కనీసం 3 సంవత్సరాలు నిరంతర సేవ పూర్తి చేసి ఉంటే గరిష్ట వయస్సు 40/45 సంవత్సరాలు వరకు సడలింపు.
- ఎక్స్-సర్వీసుమెన్: మిలిటరీ సేవను మినహాయించి గరిష్ట వయస్సులో 3 సంవత్సరాల సడలింపు.
అర్హతలు
- అవసరమైన విద్యార్హతలు:
- సంబంధిత పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం, మరియు శారీరక దారుఢ్యం (కేవలం కస్టమ్స్ మరీన్ విభాగానికి అనుగుణంగా).
- ఆవశ్యకమైన మెడికల్ ఫిట్‌నెస్: ఎంపికైన అభ్యర్థులు తమకు సరైన ఆరోగ్య పరిస్థితిని నిరూపించాలి.
దరఖాస్తు విధానం(Job Apply Process)
- దరఖాస్తు ప్రక్రియ:
- అభ్యర్థులు www.cbic.gov.in వెబ్‌సైట్ నుండి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- పూరించిన దరఖాస్తులను సమాచార సర్టిఫికేట్‌లతో కలిపి, కింది చిరునామాకు 28.02.2025 లోపు పంపాలి.
- చిరునామా:
జాయింట్ కమిషనర్ (ఎస్టాబ్లిష్‌మెంట్ & అడ్మిన్)
కస్టమ్స్ కమిషనర్ కార్యాలయం,
కస్టమ్ హౌస్, మార్మగోవా, హార్బర్, వాస్కో-డా-గామా, గోవా – 403803 - ఫోన్ నంబర్: 0832-2951103 ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
- పరీక్ష మరియు ఇంటర్వ్యూ:
- ఎంపికకు సంబంధించిన వివరాలను అర్హులైన అభ్యర్థులకు ముందుగా తెలియజేస్తారు.
- మెరిట్ ఆధారంగా ఎంపిక:
- అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- రిజర్వేషన్ నియమాలను కచ్చితంగా పాటిస్తారు.
గమనికలు
- తప్పనిసరి:
- నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు మరియు షరతులను అనుసరించి మాత్రమే దరఖాస్తు చేయాలి.
- తప్పుడు సమాచారం ఇచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
- వివరాల కోసం వెబ్‌సైట్ సందర్శించండి:
జాయింట్ కమిషనర్, గోవా కస్టమ్స్