PNB Local Bank Officer Recruitment 2026: 545 పోస్టులు, అర్హత, జీతం, పరీక్ష విధానం, అప్లై చేసే విధానం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి Local Bank Officer (LBO) పోస్టుల భర్తీకి 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 545 Local Bank Officer పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 4 పోస్టులు, తెలంగాణలో 41 పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగానికి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌తో పాటు కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 20 జూలై 2026 నుంచి ప్రారంభమై 16th August 2026 (Extended) వరకు కొనసాగుతుంది.
ముఖ్య గమనిక: ఈ నోటిఫికేషన్లో 1 సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. కాబట్టి ఫ్రెషర్స్ ఈ పోస్టుకు అర్హులు కాదు.

PNB LBO Recruitment 2026 ముఖ్య వివరాలు
PNB ఈ రిక్రూట్‌మెంట్‌ను Local Bank Officer (LBO), JMGS-I స్కేల్లో నిర్వహిస్తోంది. మొత్తం 545 పోస్టులు రాష్ట్రాల వారీగా కేటాయించబడ్డాయి. ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పేతో పాటు DA, CCA, HRA/లీజ్డ్ అకామడేషన్, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలు బ్యాంక్ నిబంధనల ప్రకారం లభిస్తాయి.
| అంశం | వివరాలు |
|---|---|
| సంస్థ | Punjab National Bank (PNB) |
| పోస్టు | Local Bank Officer (LBO) |
| స్కేల్ | JMGS-I |
| మొత్తం ఖాళీలు | 545 |
| ఉద్యోగ స్థాయి | Officer |
| దరఖాస్తు విధానం | Online |
| ప్రారంభ తేదీ | 20-07-2026 |
| చివరి తేదీ | 09-08-2026 |
| ఆన్లైన్ పరీక్ష | ఆగస్టు 2026 / సెప్టెంబర్ 2026 |
| అధికారిక వెబ్సైట్ | pnb.bank.in |
పైన పేర్కొన్న తేదీలు మరియు పోస్టు వివరాలు అధికారిక నోటిఫికేషన్లోనే ఇవ్వబడ్డాయి. ఆన్లైన్ పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన తేదీ తరువాత బ్యాంక్ ద్వారా తెలియజేయబడుతుంది.
PNB LBO Vacancy 2026: రాష్ట్రాల వారీగా ఖాళీలు
ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 17 రాష్ట్రాలు/ప్రాంతాలకు పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు ఒక్క రాష్ట్రంలోని ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒక రాష్ట్రానికి దరఖాస్తు చేసిన తరువాత మరో రాష్ట్రానికి దరఖాస్తు చేసే అవకాశం ఉండదు. మెరిట్ లిస్ట్ కూడా రాష్ట్రం మరియు కేటగిరీ ఆధారంగా తయారవుతుంది.
| రాష్ట్రం | స్థానిక భాష | ఖాళీలు |
|---|---|---|
| ఆంధ్రప్రదేశ్ | తెలుగు | 4 |
| గుజరాత్ | గుజరాతీ | 77 |
| కర్ణాటక | కన్నడ | 78 |
| మహారాష్ట్ర | మరాఠీ | 67 |
| తెలంగాణ | తెలుగు | 41 |
| తమిళనాడు | తమిళం | 51 |
| పశ్చిమ బెంగాల్ | బెంగాలీ | 80 |
| జమ్మూ & కాశ్మీర్ | ఉర్దూ/డోగ్రీ/కాశ్మీరీ | 9 |
| లడఖ్ | ఉర్దూ/పుర్గి/భోటీ | 2 |
| అరుణాచల్ ప్రదేశ్ | ఇంగ్లిష్ | 4 |
| అస్సాం | అస్సామీ/బోడో | 85 |
| మణిపూర్ | మణిపురి/మైతేయి | 6 |
| మేఘాలయ | గారో/ఖాసీ | 8 |
| మిజోరం | మిజో | 5 |
| నాగాలాండ్ | ఇంగ్లిష్ | 5 |
| సిక్కిం | నేపాలీ/సిక్కిమీస్ | 5 |
| త్రిపుర | బెంగాలీ/కోక్‌బొరోక్ | 18 |
| మొత్తం | 545 |
రాష్ట్రాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్ విభజన మరియు స్థానిక భాష వివరాలు నోటిఫికేషన్ మొదటి పేజీలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఉపయోగపడే విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లో 4 పోస్టులు, తెలంగాణలో 41 పోస్టులు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు తప్పనిసరి స్థానిక భాషగా తెలుగును నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
| రాష్ట్రం | భాష | SC | ST | OBC | EWS | UR | మొత్తం |
|---|---|---|---|---|---|---|---|
| ఆంధ్రప్రదేశ్ | తెలుగు | 0 | 0 | 0 | 0 | 4 | 4 |
| తెలంగాణ | తెలుగు | 8 | 3 | 1 | 9 | 20 | 41 |
అంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45 Local Bank Officer పోస్టులకు అవకాశం ఉంది. అయితే అభ్యర్థి ఒక రాష్ట్రంలోని పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. రాష్ట్రం ఎంపికను అప్లికేషన్ సమర్పించే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి.
విద్యార్హత ఏమిటి?
Local Bank Officer పోస్టుకు ఏదైనా విభాగంలో Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీని భారత ప్రభుత్వం లేదా సంబంధిత రెగ్యులేటరీ సంస్థలచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో Graduation మార్కుల శాతాన్ని నమోదు చేయాలి.
అలాగే కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత కనీసం ఒక సంవత్సరం Scheduled Commercial Bank లేదా RBI Act Second Scheduleలో ఉన్న Regional Rural Bankలో Clerical/Officer Cadreలో పని అనుభవం ఉండాలి. ఈ అనుభవాన్ని 09-08-2026 నాటికి కలిగి ఉండాలి.
వయోపరిమితి ఎంత?
PNB LBO పోస్టుకు సాధారణ వయోపరిమితి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. వయస్సును నిర్ణయించే Cut-off Date 01-07-2026గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయస్సులో సడలింపు ఉంటుంది.
| కేటగిరీ | గరిష్ఠ వయస్సు సడలింపు |
|---|---|
| SC/ST | 5 సంవత్సరాలు |
| OBC (Non-Creamy Layer) | 3 సంవత్సరాలు |
| PwBD | 10 సంవత్సరాలు |
| Ex-Servicemen తదితరులు | 5 సంవత్సరాలు |
| 1984 అల్లర్ల ప్రభావితులు | 5 సంవత్సరాలు |
SC/ST/OBC అభ్యర్థులకు ఇతర అనుమతించబడిన కేటగిరీలతో కలిపి వయస్సు సడలింపుకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు నోటిఫికేషన్లో ఉన్నాయి. సంబంధిత సర్టిఫికెట్లను అవసరమైన సమయంలో సమర్పించాలి.
స్థానిక భాష అర్హత
అభ్యర్థి తాను దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. ఉదాహరణకు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు భాషా ప్రావీణ్యం అవసరం.
10వ లేదా 12వ తరగతిలో సంబంధిత స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులకు Local Language Proficiency Test నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి సరైన విద్యా పత్రాలను వెరిఫికేషన్ సమయంలో చూపించాలి.
PNB LBO జీతం ఎంత?
Local Bank Officer పోస్టు JMGS-I స్కేల్లో ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం పే స్కేల్ ₹48,480 నుంచి ₹85,920 వరకు ఉంది. ప్రారంభ బేసిక్ పే ₹48,480 కాగా, నిర్ణీత ఇంక్రిమెంట్ల ద్వారా పే స్కేల్లో తదుపరి స్థాయిలకు వెళ్తుంది.
| వివరాలు | మొత్తం |
|---|---|
| ప్రారంభ Basic Pay | ₹48,480 |
| Pay Scale | ₹48,480 – ₹85,920 |
| DA | వర్తిస్తుంది |
| CCA | వర్తిస్తుంది |
| HRA/Leased Accommodation | వర్తిస్తుంది |
| Medical Insurance | వర్తిస్తుంది |
| Retirement Benefits | వర్తిస్తాయి |
ఇవి బేసిక్ పే మాత్రమే కాకుండా, బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు మరియు ప్రయోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి చేతికి వచ్చే జీతం పోస్టింగ్, అలవెన్సులు మరియు ఇతర వర్తించే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
PNB LBO Selection Process 2026
ఈ పోస్టుకు ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా Online Written Test, Screening, Local Language Proficiency Test మరియు Personal Interview దశలు ఉన్నాయి. బ్యాంక్ అవసరాన్ని బట్టి అన్ని దశలను లేదా కొన్ని దశలను నిర్వహించే హక్కును కలిగి ఉంది.
ఎంపిక దశలు
- Online Written Test
- Document Screening
- Local Language Proficiency Test (అవసరమైన వారికి)
- Personal Interview
- Final Merit List
LLPTలో అర్హత సాధించడం తప్పనిసరి అయిన సందర్భంలో, ఆ పరీక్షలో ఫెయిల్ అయితే Written Test మరియు Interviewలో మంచి మార్కులు వచ్చినా తుది ఎంపికకు అర్హత ఉండదు. తుది మెరిట్ Written Test + Interview మార్కుల ఆధారంగా రాష్ట్రం మరియు కేటగిరీ వారీగా తయారవుతుంది.
PNB LBO Exam Pattern 2026
ఆన్లైన్ రాత పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. Reasoning & Computer Aptitude, Data Analysis & Interpretation, English Language, Quantitative Aptitude, General/Economy/Banking Awareness అనే ఐదు విభాగాలు ఉంటాయి. తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 1/4 మార్కు తగ్గిస్తారు.
| పరీక్ష | ప్రశ్నలు | మార్కులు | సమయం |
|---|---|---|---|
| Reasoning & Computer Aptitude | 25 | 25 | 35 నిమిషాలు |
| Data Analysis & Interpretation | 25 | 25 | 35 నిమిషాలు |
| English Language | 25 | 25 | 25 నిమిషాలు |
| Quantitative Aptitude | 25 | 25 | 35 నిమిషాలు |
| General/Economy/Banking Awareness | 50 | 50 | 50 నిమిషాలు |
| మొత్తం | 150 | 150 | 180 నిమిషాలు |
General/EWS అభ్యర్థులకు ప్రతి సెక్షన్లో కనీసం 40% మరియు Reserved Category అభ్యర్థులకు ప్రతి సెక్షన్లో 35% కనీస అర్హత మార్కులు ఉన్నాయి. అయితే బ్యాంక్ అవసరాన్ని బట్టి ఈ కనీస అర్హత ప్రమాణాలను మార్చే హక్కు కలిగి ఉంది.
Personal Interview ఎలా ఉంటుంది?
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశలకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. Personal Interviewకు 50 మార్కులు ఉంటాయి. SC/ST అభ్యర్థులకు కనీసం 45%, అంటే 22.50 మార్కులు, ఇతర అభ్యర్థులకు కనీసం 50%, అంటే 25 మార్కులు సాధించాలి.
తుది ఎంపికలో Online Written Test మరియు Personal Interview మార్కులను కలిపి మెరిట్ తయారు చేస్తారు. LLPT అవసరమైన అభ్యర్థులు అందులో కూడా అర్హత సాధించాలి. మెరిట్ లిస్ట్ రాష్ట్రం మరియు కేటగిరీ వారీగా ఉంటుంది.
Application Fee ఎంత?
PNB LBO Recruitment 2026కు దరఖాస్తు ఫీజు కేటగిరీ ఆధారంగా ఉంటుంది. SC, ST మరియు PwBD అభ్యర్థులకు ₹50 + 18% GST, అంటే ₹59 మాత్రమే చెల్లించాలి. మిగతా అభ్యర్థులకు ₹1,000 + 18% GST, అంటే ₹1,180 చెల్లించాలి.
| కేటగిరీ | ఫీజు |
|---|---|
| SC/ST/PwBD | ₹59 |
| ఇతర అభ్యర్థులు | ₹1,180 |
ఫీజును Online Modeలో మాత్రమే చెల్లించాలి. Debit Card, Credit Card, Internet Banking, IMPS, Mobile Wallets మరియు UPI వంటి మార్గాల ద్వారా చెల్లించే అవకాశం ఉంది. ఫీజు చెల్లింపు విజయవంతమైన తరువాత e-receipt తీసుకుని భద్రపరుచుకోవాలని బ్యాంక్ సూచించింది.
PNB LBO Recruitment 2026: ముఖ్యమైన తేదీలు
ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన తేదీలను అభ్యర్థులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. Online Registration 20 జూలై 2026న ప్రారంభమైంది. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 16th August 2026 (Extended) గా నోటిఫికేషన్లో ఉంది. Online Test తేదీని ప్రస్తుతం ఆగస్టు/సెప్టెంబర్ 2026గా తాత్కాలికంగా పేర్కొన్నారు.
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ తేదీ | 20-07-2026 |
| Online Registration ప్రారంభం | 20-07-2026 |
| Online Registration చివరి తేదీ | 09-08-2026 |
| Online Test | ఆగస్టు 2026 / సెప్టెంబర్ 2026 |
| పరీక్ష Call Letter | బ్యాంక్ తరువాత ప్రకటిస్తుంది |
Online Test, LLPT మరియు Interview Call Letters పోస్టు ద్వారా పంపరు. అభ్యర్థులు PNB అధికారిక వెబ్సైట్లో Recruitment/Careers విభాగం ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి.
Also Check : IBPS CSA Recruitment 2026
DCCB Bank స్టాఫ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) LBO Recruitment 2026
PNB LBOకి ఎలా Apply చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు PNB అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే Onlineలో దరఖాస్తు చేయాలి. ముందుగా వ్యక్తిగత Email ID మరియు Mobile Number సిద్ధంగా ఉంచుకోవాలి. New Registration ద్వారా నమోదు చేసుకున్న తరువాత Provisional Registration Number మరియు Password వస్తాయి.
దరఖాస్తు సమయంలో ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, Handwritten Declaration మరియు అవసరమైన విద్యా/కేటగిరీ/అనుభవ పత్రాలను అప్లోడ్ చేయాలి. Submit చేయడానికి ముందు మొత్తం వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. Complete Registration చేసిన తరువాత వివరాల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.
Apply చేయడానికి ముఖ్యమైన Steps
- PNB అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
- Recruitments / Careers విభాగంలో LBO Recruitmentను ఎంచుకోవాలి.
- Click Here for New Registrationపై క్లిక్ చేయాలి.
- వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- విద్యార్హత, అనుభవం, రాష్ట్రం మరియు కేటగిరీ వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- Online Application Fee చెల్లించాలి.
- Complete Registration చేయాలి.
- Application Form మరియు e-Receiptను భద్రపరుచుకోవాలి.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం 20-07-2026 నుంచి 16th August 2026 (Extended) వరకు మాత్రమే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
PNB LBO ఉద్యోగంలో Posting ఎలా ఉంటుంది?
ఎంపికైన అభ్యర్థులు Local Bank Officerగా నియమితులై 2 సంవత్సరాల probationలో ఉంటారు. Induction Training పూర్తయిన తరువాత వారు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోని వివిధ Circlesలో పోస్టింగ్ పొందవచ్చు.
ఎంపికైన LBOలు వారు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోనే 9 సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యే వరకు లేదా SMG Scale IVకి ప్రమోషన్ పొందే వరకు, ఏది ముందైతే అది వరకు పోస్టింగ్‌లో ఉండే నిబంధన ఉంది. అయితే పోస్టింగ్ స్థలం, పాత్ర మరియు తరువాతి బదిలీలను నిర్ణయించే అధికారం బ్యాంక్‌కు ఉంటుంది.
3 సంవత్సరాల Indemnity Bond మరియు CIBIL నిబంధన
ఎంపికైన అభ్యర్థులు కనీసం 3 సంవత్సరాల పాటు బ్యాంకులో సేవ చేయడానికి Indemnity Bond ఇవ్వాలి. 3 సంవత్సరాల యాక్టివ్ సర్వీస్ పూర్తికాక ముందే ఉద్యోగం వదిలేస్తే ₹2 లక్షల మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ చెబుతోంది.
అలాగే ఉద్యోగంలో చేరే సమయంలో అభ్యర్థికి సాధారణంగా CIBIL Score 680 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అయితే CIBIL Score అనేది దరఖాస్తు చేసుకోవడానికి ముందస్తు అర్హత కాదు. బ్యాంక్ ఖాతా లేని అభ్యర్థులకు CIBIL Status సమర్పణ అవసరం లేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
PNB LBO Recruitment 2026 FAQs
ఈ పోస్టుకు సంబంధించిన ముఖ్యమైన సందేహాలకు అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా సమాధానాలు క్రింద ఇచ్చాం. ముఖ్యంగా Graduation మాత్రమే ఉంటే సరిపోతుందా, Experience అవసరమా, Local Language Test ఎవరికి ఉంటుంది వంటి ప్రశ్నలు అభ్యర్థులకు ఎక్కువగా వస్తాయి. క్రింది సమాధానాలు నోటిఫికేషన్‌లోని అర్హత మరియు ఎంపిక నిబంధనల ఆధారంగా ఉన్నాయి.
PNB LBO Recruitment 2026లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 545 Local Bank Officer పోస్టులు ఉన్నాయి.
PNB LBOకి Graduation సరిపోతుందా?
Graduation తప్పనిసరి. అయితే Graduationతో పాటు కనీసం 1 సంవత్సరం సంబంధిత బ్యాంకింగ్ అనుభవం కూడా అవసరం.
Freshers PNB LBOకి Apply చేయవచ్చా?
లేదు. నోటిఫికేషన్ ప్రకారం కనీసం ఒక సంవత్సరం post-qualification Clerical/Officer Cadre బ్యాంకింగ్ అనుభవం అవసరం.
తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
తెలంగాణలో 41 Local Bank Officer పోస్టులు ఉన్నాయి. స్థానిక భాషగా తెలుగు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్‌లో 4 పోస్టులు ఉన్నాయి. అన్ని 4 పోస్టులు UR కేటగిరీలో ఉన్నట్లు నోటిఫికేషన్ పట్టికలో చూపించారు.
వయోపరిమితి ఎంత?
సాధారణ అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాలు. Age Cut-off Date 01-07-2026.
Local Language Test తప్పనిసరిగా రాయాలా?
10వ లేదా 12వ తరగతిలో సంబంధిత స్థానిక భాష చదవని అభ్యర్థులు LLPT రాయాలి. సంబంధిత భాషను 10వ/12వ తరగతిలో చదివినట్లు ఆధారం చూపగలిగితే మినహాయింపు ఉంటుంది.
PNB LBO Examలో Negative Marking ఉందా?
ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 1/4 మార్కు తగ్గిస్తారు.
Interview ఎన్ని మార్కులకు ఉంటుంది?
Personal Interview 50 మార్కులకు ఉంటుంది. SC/STలకు కనీసం 22.50, ఇతర అభ్యర్థులకు కనీసం 25 మార్కులు సాధించాలి.
PNB LBO జీతం ఎంత?
పే స్కేల్ ₹48,480 – ₹85,920. దీనికి అదనంగా DA, CCA, HRA/Leased Accommodation, Medical Insurance తదితర ప్రయోజనాలు బ్యాంక్ నిబంధనల ప్రకారం ఉంటాయి.
PNB Local Bank Officer Recruitment 2026లో మొత్తం 545 పోస్టులు ఉండగా, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 41 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగానికి Graduationతో పాటు కనీసం ఒక సంవత్సరం సంబంధిత బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి కావడంతో అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ16th August 2026 (Extended). అప్లికేషన్లో రాష్ట్రం, కేటగిరీ, విద్యార్హత, అనుభవం, స్థానిక భాష వంటి వివరాలను చాలా జాగ్రత్తగా నమోదు చేయాలి, ఎందుకంటే Complete Registration తరువాత మార్పులకు అవకాశం లేదని బ్యాంక్ స్పష్టం చేసింది.
ముఖ్యమైన Links
Official Website: Punjab National Bank Official Website
Apply Online: PNB Website → Recruitments / Careers → Local Bank Officer Recruitment

My name is Srinivasu I Apply panjab National Bank i proud of you
Haa
I want to the apply my job
nice