NPCIL MAPS Apprentice Recruitment 2026 Detailed Notification
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ప్రముఖ సంస్థ Nuclear Power Corporation of India Limited (NPCIL) మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (MAPS), కల్పాక్కం యూనిట్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ట్రైనింగ్ చేయాలనుకునే ITI, డిప్లొమా మరియు డిగ్రీ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 158 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹9,600 నుండి ₹12,300 వరకు స్టైపెండ్ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
రిక్రూట్మెంట్ ముఖ్యాంశాలు
| అంశం | వివరాలు |
|---|---|
| సంస్థ పేరు | NPCIL – Madras Atomic Power Station |
| పోస్టుల పేరు | Trade / Diploma / Graduate Apprentice |
| మొత్తం ఖాళీలు | 158 |
| ఉద్యోగ స్థలం | కల్పాక్కం, తమిళనాడు |
| దరఖాస్తు విధానం | Offline |
| ట్రైనింగ్ కాలం | 1 సంవత్సరం |
| స్టైపెండ్ | ₹9,600 – ₹12,300 |
| చివరి తేదీ | 30-06-2026 |
పోస్టుల పూర్తి వివరాలు
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు – 124
| ట్రేడ్ | పోస్టులు |
|---|---|
| Fitter | 39 |
| Machinist | 10 |
| Turner | 6 |
| Welder | 6 |
| D’MAN Mechanical | 5 |
| Electrician | 18 |
| Instrument Mechanic | 18 |
| Electronic Mechanic | 18 |
| Carpenter | 1 |
| Plumber | 1 |
| Mason | 2 |
స్టైపెండ్:
- 1 Year ITI వారికి ₹9,600
- 2 Years ITI వారికి ₹10,560
డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు – 18
| విభాగం | పోస్టులు |
|---|---|
| Mechanical | 6 |
| Electrical | 3 |
| Electronics & Instrumentation | 6 |
| Civil | 3 |
స్టైపెండ్: ₹10,900 నెలకు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు – 16
| విభాగం | పోస్టులు |
|---|---|
| Human Resources | 7 |
| Contracts & Material Management | 3 |
| Finance & Accounts | 2 |
| Health Physics Unit | 2 |
| Chemical Lab | 2 |
స్టైపెండ్: ₹12,300 నెలకు
కేటగిరీ వారీ ఖాళీలు
ట్రేడ్ అప్రెంటిస్
| Category | పోస్టులు |
|---|---|
| SC | 23 |
| ST | 1 |
| OBC | 33 |
| EWS | 12 |
| UR | 55 |
డిప్లొమా అప్రెంటిస్
| Category | పోస్టులు |
|---|---|
| SC | 3 |
| ST | 0 |
| OBC | 4 |
| EWS | 1 |
| UR | 10 |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
| Category | పోస్టులు |
|---|---|
| SC | 3 |
| ST | 0 |
| OBC | 4 |
| EWS | 1 |
| UR | 8 |
PwBD అభ్యర్థులకు రిజర్వేషన్
NPCIL మొత్తం 6 పోస్టులను PwBD అభ్యర్థులకు కేటాయించింది.
| Disability Category | పోస్టులు |
|---|---|
| Blindness / Low Vision | 1 |
| Deaf & Hard of Hearing | 2 |
| Locomotor Disability | 2 |
| Autism / Learning Disability | 1 |
వయోపరిమితి వివరాలు
| పోస్టు | వయస్సు |
|---|---|
| ట్రేడ్ అప్రెంటిస్ | 18 – 24 సంవత్సరాలు |
| డిప్లొమా అప్రెంటిస్ | 18 – 25 సంవత్సరాలు |
| గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 21 – 28 సంవత్సరాలు |
వయో సడలింపులు
- SC/ST – 5 సంవత్సరాలు
- OBC – 3 సంవత్సరాలు
- PwBD – 10 సంవత్సరాలు
విద్యార్హతలు పూర్తి వివరాలు
ట్రేడ్ అప్రెంటిస్
సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ అయి ఉండాలి.
డిప్లొమా అప్రెంటిస్
రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
BA, B.Sc, B.Com లేదా ఇతర డిగ్రీ కోర్సులు పూర్తి చేసి ఉండాలి.
అన్ని కోర్సులు Full-Time / Regular విధానంలో పూర్తి చేసి ఉండాలి.
శారీరక అర్హతలు
| అంశం | అర్హత |
|---|---|
| కనీస ఎత్తు | 137 సెం.మీ |
| కనీస బరువు | 25.4 కిలోలు |
| ఛాతి విస్తరణ | 3.8 సెం.మీ |
అభ్యర్థులు అంటువ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి.
ఎంపిక విధానం
NPCIL ఈ రిక్రూట్మెంట్‌లో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించదు. అభ్యర్థుల విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
మెరిట్ టై పరిస్థితిలో
- వయస్సు ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యం
- తరువాత 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
ముఖ్య గమనిక
కల్పాక్కం ప్లాంట్‌కు 16 కిలోమీటర్ల పరిధిలో నివసించే అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
ముఖ్యమైన షరతులు
- ఇప్పటికే Apprenticeship చేసిన వారు అర్హులు కాదు
- ప్రస్తుతం Apprenticeship చేస్తున్న వారు అప్లై చేయరాదు
- ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగ హామీ లేదు
- తప్పుడు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వం రద్దు చేస్తారు
అవసరమైన డాక్యుమెంట్స్
దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా జతచేయాలి:
- 10వ తరగతి మెమో
- 12వ తరగతి మెమో
- ITI / డిప్లొమా / డిగ్రీ సర్టిఫికేట్లు
- సెమిస్టర్ మార్కుల మెమోలు
- కుల ధృవీకరణ పత్రం
- EWS సర్టిఫికేట్
- ఆధార్ కార్డు
- పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్
- Character Certificate
- 4 పాస్‌పోర్ట్ ఫోటోలు
- Apprenticeship Registration Copy
ఎలా దరఖాస్తు చేయాలి?
Step 1
ముందుగా సంబంధిత పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి.
- Trade Apprentice → NAPS Portal
- Diploma / Graduate Apprentice → NATS Portal
Step 2
NPCIL అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 3
ఫారమ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లు జతచేయాలి.
Step 4
పోస్టు ద్వారా ఈ అడ్రస్‌కు పంపాలి:
Deputy Manager (HRM)
Nuclear Power Corporation of India Limited
Madras Atomic Power Station
Kalpakkam – 603102
Tamil Nadu
ముఖ్యమైన తేదీలు
| అంశం | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | మే 2026 |
| దరఖాస్తుల ప్రారంభం | ఇప్పటికే ప్రారంభం |
| చివరి తేదీ | 30-06-2026 |
FAQs
1) NPCIL Apprentice Recruitment 2026లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 158 పోస్టులు ఉన్నాయి.
2) ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయవచ్చు?
ITI, డిప్లొమా మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
3) ఎలాంటి పరీక్ష ఉంటుంది?
లేదు. మార్కుల ఆధారంగా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.
4) ట్రైనింగ్ వ్యవధి ఎంత?
1 సంవత్సరం.
5) ఉద్యోగం పర్మనెంట్ అవుతుందా?
లేదు. ఇది Apprenticeship Training మాత్రమే.
6) అప్లికేషన్ ఎలా పంపాలి?
ఆఫ్‌లైన్ ద్వారా పోస్టు చేయాలి.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ ట్రైనింగ్ చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులకు NPCIL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. ముఖ్యంగా ITI, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి పరీక్ష లేకుండా ఎంపిక జరగడం పెద్ద ప్లస్ పాయింట్. ప్రభుత్వ రంగ అణుశక్తి సంస్థలో అనుభవం సంపాదించాలనుకునే వారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ దగ్గరపడే ముందు అప్లై చేయడం మంచిది.
NAPS 2.0 Portal [Trade Apprenties-Mandetory Registretion]
NAPS 2.0 Portal [Diploma&Graduate Apprenties-Mandetory Registreation]
