AP Revenue Dept. Job Notification 2024
ఈ-డివిజనల్ మేనేజర్ ,ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణం జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ రెవెన్యూ డివిజన్ భీమునిపట్టణం. ఈ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో 40 పోస్టులతో ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్స్( E- District Mangers), ఈ – డివిజనల్ మేనేజర్స్ (E-Divisional Manager) కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టుల భర్తీ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. BE, BTECH, BSC, BCA, మాస్టర్స్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రకటన లోని పూర్తి సమాచారం చుసిన తర్వాత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
భర్తీ చేయు పోస్టులు :
- ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్స్( E- District Mangers)- 13 పోస్టులు
- ఈ – డివిజనల్ మేనేజర్స్ (E-Divisional Manager) – 27 పోస్టులు
శాలరీ : 22,500/-
ఎంపిక విధానం
ఈ పోస్టు కోసం BE, BTECH, BSC, BCA, మాస్టర్స్ ఇలా ఏదయినా డిగ్రీ అర్హత ఉండాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షల్లో పాస్ అయినవారికి డిస్ట్రిక్ట్ కమిటీ పర్యవేక్షణలో ఇంటర్వ్యూ ఉంటుంది . అభ్యర్థులు తమ అనుభవం మరియు విద్యార్హతల ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
- కనీసం 10వ తరగతి లేదా మాధ్యమిక విద్య పూర్తిచేయాలి.
- ఇంటర్, డిగ్రీ, పీజీ లేదా ఇతర సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.
- టెక్నికల్ క్వాలిఫికేషన్, అనుభవం , ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంది.
వయస్సు పరిమితి:
అభ్యర్థుల వయస్సు 01.07.2022 నాటికి 21 నుండి 35 సంత్సరాలు నిర్ధారించబడాలి. వయస్సు గరిష్ట పరిమితి కోసం నోటిఫికేషన్‌లో నిబంధనలను ఒకసారి పరిశీలినచండి .
ముఖ్యమైన నిబంధనలు:
- ఎంపిక విధానం: ఎంపిక క్రమం ప్రకారం శ్రద్ధతో నిర్వహించబడుతుంది. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, ఇతర నిబంధనలు పరిశీలించి ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం: అభ్యర్థులు వారి పూర్తి వివరాలను స్పష్టంగా దరఖాస్తులో నమోదు చేయాలి. వారి విద్యార్హతలు, అనుభవం, తల్లిదండ్రుల పేరు, పుట్టినతేది, లింగం, చిరునామా తదితర అంశాలు పూర్తి చేసి, సర్టిఫికెట్లను జతపరచాలి.
- అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయడం: అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారమ్ నందు సమస్త వివరాలను సక్రమంగా పూరించి, సంతకం చేసి సమర్పించాలి.
కమ్యూనిటీ మరియు జాతి సర్టిఫికేట్లు:
ఆధార్, కమ్యూనిటీ సర్టిఫికేట్, జాతి సర్టిఫికేట్ వంటి ఆధారాలు జతచేయాలి. SC, ST మరియు BC వర్గాలకు తగిన సర్టిఫికేట్లు ఉండటం చాలా ముఖ్యం.
అప్లికేషన్ సమర్పణ ప్రక్రియ:
అర్హతలు ఉన్న అభ్యర్థులు మొదటగా www.visakhapatnam.ap.gov.in వెబ్సైటు నందు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. తర్వాత ప్రింటెడ్ అప్లికేషన్ ఫారంను ఆఫ్ లైన్ విధానంలో విశాఖపట్నం కలెక్టర్వారి కార్యాలయానికి 4th నవంబర్ 2024 తేదీలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. అభ్యర్థులు దరఖాస్తు పూర్తి చేసిన తరువాత, అందులోని వివరాలు సరైనవని నిర్ధారించుకోవాలి. తప్పుడు సమాచారం లేదా తప్పు ఉంటే, నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు సంబంధిత అధికారులకు పూర్తి హక్కులు ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన పత్రాలు:
- విద్యార్హత సర్టిఫికేట్లు
- టెక్నికల్ సర్టిఫికేట్లు
- అనుభవ పత్రాలు
- కమ్యూనిటీ మరియు జాతి సర్టిఫికేట్లు
- ఆధార్ కార్డు, చిరునామా పత్రం
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
అన్నీ పత్రాలు గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్ట్ తప్పనిసరిగా చేయించాలి .
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్:
అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడానికి సంబంధిత తారీఖు మరియు ప్రదేశం వివరాలు పరిశీలించాలి.