Degree Qualification Jobs Telangana Muncipal Jobs | Latest jobs in telugu

Spread the love

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న 316 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణా ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు విడుదల చేశారు. ఇందులో వివిధ పోస్టులు, అదనంగా గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, జూనియర్ అసిస్టెంట్స్, శానిటరీ ఇన్స్పెక్టర్లు వంటి ఉద్యోగాలున్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన, ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు మరియు అర్హతలు:

Sl.noJob titleNo.of Posts
1గ్రేడ్ 1 సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్లు7 పోస్టులు
2గ్రేడ్ 2 అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్లు:43 పోస్టులు
3గ్రేడ్ 3 మున్సిపల్ కమీషనర్లు41 పోస్టులు
4హెల్త్ ఆఫీసర్లు 7 పోస్టులు
5రెవెన్యూ మేనేజర్లు11 పోస్టులు
6శానిటరీ సూపర్వైజర్లు10 పోస్టులు
7శానిటరీ ఇన్స్పెక్టర్లు86 పోస్టులు
8హెల్త్ అసిస్టెంట్లు96 పోస్టులు
9జూనియర్ అసిస్టెంట్లు15 పోస్టులు
Total మొత్తం 316 పోస్టులు

అర్హతలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం ఏదైనా డిగ్రీ (Degree qualification jobs)లేదా సంబంధిత అంశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. కొంతమంది పోస్టులకు అనుభవం కూడా అవసరం కావచ్చు.

See also  Indian Army TES 55 Recruitment 2025 – Technical Entry Scheme July 2026 | 90 Vacancies

వయోపరిమితి:

దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

పురపాలక శాఖలో పోస్టుల కోసం రాత పరీక్ష నిర్వహించి, జిల్లాలలోనే పరీక్షలు నిర్వహించి, ఆయా జిల్లాలలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.45,000 వరకు జీతం ఉంటుంది. ఈ జీతంతోపాటు అన్ని రకాల అలవెన్సులు, బెనిఫిట్లు కూడా ఉంటాయి.

నోటిఫికేషన్ విడుదల తేదీ:

తెలంగాణా ప్రభుత్వం శనివారం రోజు పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.


Spread the love

Leave a Comment