స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన Central Recruitment & Promotion Department, Mumbai ద్వారా Circle Based Officer (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ పౌరుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు వారు అప్లై చేసిన సర్కిల్‌లోనే పని చేయాల్సి ఉంటుంది.
See also Nutrihub ICAR-IIMR Hyderabad Recruitment 2025 | Project Manager & Technical Assistant Posts
📌 ముఖ్యమైన తేదీలు
| వివరాలు | తేదీ |
|---|---|
| అప్లికేషన్ ప్రారంభం | 29 జనవరి 2026 |
| లాస్ట్ డేట్ | 18 ఫిబ్రవరి 2026 |
| కాల్ లెటర్ | మార్చి 2026 |
| ఆన్‌లైన్ పరీక్ష | మార్చి 2026 (అంచనా) |
పోస్టుల వివరాలు
- పోస్ట్ పేరు: Circle Based Officer (CBO)
- కేడర్: Junior Management Grade Scale-I (JMGS-I)
- మొత్తం పోస్టులు: 2050
- నియామకం: సర్కిల్ ఆధారంగా
- ప్రొబేషన్ పీరియడ్: 6 నెలలు
గమనిక: ఒక అభ్యర్థి ఒక్క సర్కిల్‌కే అప్లై చేయాలి.
విద్యార్హత
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ
- Integrated Dual Degree, Engineering, Medical, CA, ICWA అర్హతలున్నవారు కూడా అప్లై చేయవచ్చు
అనుభవ అర్హత
- 31.12.2025 నాటికి కనీసం 2 సంవత్సరాల ఆఫీసర్ అనుభవం
- Scheduled Commercial Bank లేదా Regional Rural Bankలో పని చేసి ఉండాలి
- SBI క్లరికల్ / కాంట్రాక్ట్ ఉద్యోగులు అప్లై చేయలేరు
వయస్సు పరిమితి (31.12.2025 నాటికి)
- కనీసం: 21 సంవత్సరాలు
- గరిష్టం: 30 సంవత్సరాలు
వయస్సు సడలింపు
| వర్గం | సడలింపు |
|---|---|
| SC / ST | 5 సంవత్సరాలు |
| OBC (NCL) | 3 సంవత్సరాలు |
| PwBD (GEN) | 10 సంవత్సరాలు |
| PwBD (OBC) | 13 సంవత్సరాలు |
| PwBD (SC/ST) | 15 సంవత్సరాలు |
లోకల్ లాంగ్వేజ్ అర్హత
- అప్లై చేసిన సర్కిల్‌కు సంబంధించిన స్థానిక భాషలో
చదవడం – రాయడం – అర్థం చేసుకోవడం రావాలి - 10వ లేదా 12వ తరగతిలో ఆ భాష చదివినట్లయితే లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేదు
ఎంపిక విధానం (Selection Process)
1️⃣ ఆన్‌లైన్ పరీక్ష
Objective Test – 120 మార్కులు
| సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
|---|---|---|---|
| English Language | 30 | 30 | 30 నిమిషాలు |
| Banking Knowledge | 40 | 40 | 40 నిమిషాలు |
| General Awareness / Economy | 30 | 30 | 30 నిమిషాలు |
| Computer Aptitude | 20 | 20 | 20 నిమిషాలు |
Descriptive Test – 50 మార్కులు
- Essay & Letter Writing (ఇంగ్లిష్‌లో)
2️⃣ స్క్రీనింగ్
- అనుభవం & జాబ్ ప్రొఫైల్ వెరిఫికేషన్
3️⃣ ఇంటర్వ్యూ
- మొత్తం మార్కులు: 50
4️⃣ ఫైనల్ సెలక్షన్
- ఆన్‌లైన్ టెస్ట్ (75%) + ఇంటర్వ్యూ (25%)
- సర్కిల్ & కేటగిరీ వారీగా మెరిట్ లిస్ట్
జీతం వివరాలు
- ప్రారంభ బేసిక్ పే: ₹48,480
- DA, HRA / లీజ్ రెంటల్, CCA
- PF, NPS, మెడికల్, LTC, ఇతర అలవెన్సులు వర్తిస్తాయి
అప్లికేషన్ ఫీజు
| కేటగిరీ | ఫీజు |
|---|---|
| General / OBC / EWS | ₹750 |
| SC / ST / PwBD | ఫీజు లేదు |
అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు
- ఫోటో
- సంతకం
- Left Thumb Impression
- Handwritten Declaration
- ID ప్రూఫ్
- DOB ప్రూఫ్
- విద్యార్హత సర్టిఫికేట్లు
- అనుభవ సర్టిఫికేట్లు
- Resume
అప్లై చేసే విధానం
- SBI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి
- Careers → Current Openings క్లిక్ చేయండి
- CRPD/CBO/2025-26/18 నోటిఫికేషన్ ఓపెన్ చేయండి
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి
- ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి
ముఖ్య సూచనలు
- చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే అప్లై చేయండి
- తప్పు సమాచారం ఇస్తే దరఖాస్తు రద్దు అవుతుంది
- అన్ని అప్డేట్స్ SBI వెబ్‌సైట్‌లో మాత్రమే ఉంటాయి
❓ FAQs
Q1: ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా?
లేదు. కనీసం 2 సంవత్సరాల బ్యాంక్ అనుభవం అవసరం.
Q2: పరీక్ష నెగటివ్ మార్కింగ్ ఉందా?
లేదు. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో నెగటివ్ మార్కింగ్ లేదు.
Q3: సర్కిల్ మార్చుకునే అవకాశం ఉందా?
లేదు. 12 సంవత్సరాలు లేదా SMGS-IV వరకు మార్పు ఉండదు.
