10th pass govt jobs AP వెల్ఫేర్ Dept. లో కాంట్రాక్టు ఉద్యోగాలు | AP Welfare Dept. Notification 2024

Spread the love

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా స్త్రీ మరియు   శిశుసంక్షేమ మరియు సాధికారిత అధికారిని వారి కార్యాలయం (ICPS,SAA & Children Homes, Vijayawada) నుండి అవుట్ సోర్సింగ్/కాంట్రాక్టు విధానంలో మొత్తం 22 పోస్టులకు  ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల ప్రకటన లో హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, హెల్పర్, కుక్, ఆయా, డేటా ఎనలిస్ట్, అకౌంటెంట్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, చౌకిదర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కేవలం లోకల్ లో ఉండే మహిళలు మాత్రమే అర్హులు.10th, 10+2,ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి ఒక సారి చదివి అప్లై చేసుకోండి.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో మొత్తం 22 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వివరాలు క్రింద తెలిపిన విధంగా వున్నయి. 

See also  AP విద్యాశాఖలో 26 జిల్లాలవారికి 255 ఉద్యోగాలు | AP EdCIL Notification 2025 

1. ICPS(DCPU) Unit – అకౌంటెంట్ -1,  డేటా ఎనలిస్ట్ -1

2. SAA Unit – మేనేజర్/ కొ-ఆర్డినేటర్ -1,  ANM (Nurse) -1, పార్ట్ టైమ్ డాక్టర్ -1, చౌకిదర్ (watch women) –  (1), ఆయా పోస్టులు -4.

3. చిల్డ్రన్ హోమ్ – స్టోర్ కీపర్ + అకౌంటెంట్ -1 , educator పార్ట్ టైమ్ -1, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైమ్ -2, PT instructor cum Yoga teacher(part time) -2 posts, Cook (Outsourcing) – 1, Helper (Outsourcing) – 2, House keeper (Outsourcing) – 2, Helper cum Night watch women  (Outsourcing) – 1.

10th, 10+2, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి వయసు 18 నుండి 42 మధ్య  ఉన్న మహిళా   అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

Apply for Postal Jobs

ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు :

దరఖాస్తులు స్వీకరించుటకు గడువు 26.10.2024 నుండి 05.11.2024 5.00 PM వరకు ఉంది   ఆసక్తిగల స్థానిక మహిళా’ అభ్యర్ధులు ntr.ap.gov.in నుండి దరఖాస్తులు డౌన్లోడు చేసుకొని పూర్తిచేసిన అన్ని ధ్రువపత్రాల నకళ్ళు గజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి దరఖాస్తులు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము(ICPS,SAA & Children Homes, Vijayawada) , డోర్ నెంబర్ 6-93, కార్మెల్ చర్చి ఎదురురోడ్, కానూరు, విజయవాడ వారి కార్యాలయమునకు అభ్యర్ధులు స్వయముగా సమర్పించవలెన వారికి అందించాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.ఇంకా దివ్యయానగులకు 10 సవత్సరాలు సడలింపు ఉంది..

See also  Railway Coach Factory Recruitment 2025, Apply Now for Various Level-1 and Level-2 Posts

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో మంచి మెరిట్ మార్కులు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లా కేంద్రంలో ఉద్యోగం వస్తుంది.

శాలరీ ఎంత ఉంటుంది:

పోస్టులను అనుసరించి ₹7,944/- నుండి ₹23,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇవి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు.

1. ICPS(DCPU) Unit – అకౌంటెంట్ -18,536/-,  డేటా ఎనలిస్ట్ -18,536/-

2. SAA Unit – మేనేజర్/ కొ-ఆర్డినేటర్ -23,170/-,  ANM (Nurse) -11,916/-, పార్ట్ టైమ్ డాక్టర్ -9,930/- చౌకిదర్ (watch women) –  7,944 , ఆయా పోస్టులు -7,944/-

3. చిల్డ్రన్ హోమ్ – స్టోర్ కీపర్ + అకౌంటెంట్ -18,536/-, educator పార్ట్ టైమ్ -10 ,000/- ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైమ్ -10,000/-, PT instructor cum Yoga teacher(part time) -10,000/-, Cook (Outsourcing) – 9,930/-, Helper (Outsourcing) – 7,944/-, House keeper (Outsourcing) – 7,944/-, Helper cum Night watch women  (Outsourcing) – 7,944/-.

See also  PM ఇంటర్న్షిప్ స్కీం ద్వారా AP, తెలంగాణాలో 12,528 ఉద్యోగాలు విడుదల | PM Internship Scheme 2025

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

10th (10th pass govt jobs), ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

4th నుండి 7th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

అనుభవం సర్టిఫికెట్స్, అప్లికేషన్ ఫారం ఉండాలి.అన్ని ధ్రువపత్రాల నకళ్ళు గజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించాలి. 

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత ఈ  క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోని అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యగలరు.

Notification PDF Download link


ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సంబందించిన జిల్లావారు ఆయా జిల్లాకి గాను దరఖాస్తు చేసుకోగలరు.


Spread the love

Leave a Comment